వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వు ఇస్తావా?...లేక వస్తావా...అర్థరాత్రి మహిళపై...పోలీస్ దౌర్జన్యం...

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లా: పోలీస్..అంటే అచ్చతెలుగులో రక్షక భటుడు...ఎవరన్నాతిట్టినా...కొట్టినా...శాంతిభధ్రతలకు విఘాతం కలిగించినా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇమ్మంటారు. ఎందుకంటే అక్కడ ఉండే పోలీసులు వచ్చి మనను వారి బారి నుంచి రక్షిస్తారని..శాంతిభద్రతలను కాపాడతారని..కానీ కంచే చేను మేసినట్లు ఓ రక్షక భటుడు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ప్రవర్తించాడు...తానే భీభత్సం సృష్టించాడు...పూటుగా మద్యం సేవించి...అర్థరాత్రి...అదీ ఒక మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు...తన నీచపు ప్రవర్తనతో కరడుకట్టిన ఖాకీనే కాదు కామాంధుడిని అని కూడా నిరూపించుకున్నాడు.

ధర్మవరం పట్టణంలోని ఓ కానిస్టేబుల్‌ పుల్లుగా మద్యం తాగి..అర్ధరాత్రి ఓ ఇంటి తలుపు తట్టి, ఆ ఇంటి మహిళను నిద్రలేపి నానా రభస చేశాడు. వివాహిత నుద్దేశించి మాట్లాడుతూ..."నీ భర్త నా వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. రూ.7 చొప్పున వడ్డీ చెల్లిస్తానని మాట ఇచ్చాడు.. మూడు నెలలుగా వడ్డీ ఇవ్వట్లేదు...వస్తే లేడని చెబుతున్నావ్‌...మరి వడ్డీ నువ్వు ఇస్తావా...లేదంటే వస్తావా"...అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు...అప్పటికి ఎలాగోలా ఆ కీచక పోలీసు బారి నుంచి తప్పించుకున్న మహిళ గురువారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బైటపడింది.

Police Misbehave with Women in AP

బాథితుల కథనం ప్రకారం...ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వెంకటేష్ కు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ రూ.80 వేలు అప్పుగా ఇచ్చాడు. అది కూడా నూటికి రూ.7వడ్డీతో ఇచ్చినట్లు బాధితుల ద్వారా తెలుస్తోంది.నాలుగేళ్ల క్రితం తీసుకున్న రుణానికి ప్రతి నెలా వడ్డీ కడుతున్నారు.అయితే మూడు నెలలుగా ఆర్థిక సమస్యలు అధికం కావడంతో వడ్డీ కట్టలేకపోయామని బాధితులు తెలిపారు. దీంతో తన వడ్డీ కట్టాలంటూ హెచ్చిరిస్తున్నకానిస్టేబుల్‌ ఉన్నట్టుండి ఇలా రెచ్చిపోయాడంటున్నారు. బుధవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ ఫుల్లుగా మద్యం సేవించి వెంకటేష్ ఇంటికెళ్లాడు. ఆ సమయంలో వెంకటేష్ ఇంట్లో లేడు...అతని భార్య ఒక్కతే ఉంది.

మద్యం మత్తుతో తూగిపోతున్న కానిస్టేబుల్‌ వెంకటేష్ ఇంటి తలుపులు బాదాడు. భయంతో బిక్కుబిక్కుమంటూ వచ్చిన ఆ మహిళ...కిటీకీలో నుంచే తన భర్త ఇంటిలో లేడనీ, రేపు ఉదయమే వచ్చి మాట్లాడాలని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌ బిగ్గరగా అరుస్తూ తలుపులు తెరవాలని ఆదేశించాడు. పరువుకు భయపడి ఆమె తలుపులు తీయగానే నానా రభస చేశాడు. 'వడ్డీ డబ్బులు నువ్విస్తావా...లేదంటే వస్తావా' అంటూ దుర్భాషలాడాడని బాధితులు చెబుతున్నారు. ఈ కానిస్టేబుల్ కు... పేకాట రాయుళ్లను గుర్తించి, వారికి అప్పులివ్వటం, అధిక వడ్డీలు వసూలు చేయటం పరిపాటిగా మారిందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అతడి భయోత్పాతంపై బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఫైనల్ గా కేసు నమోదు చేస్తారో? లేక సర్థి చెప్పి రాజీ చేస్తారో వేచి చూడాలి.

English summary
A Police conistable misbehaving and passing lewd comments at a woman in Dharmavaram, Ananthapur district . The Victim woman lodged a complaint and said...The police made very abuse and indecent comments, so I approached to the police station for justice,” the woman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X