• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అర్దరాత్రి మంటల్లో కాలుతూ హాహాకారాలు చేసిన కావ్య కేసులో వీడిన మిస్టరీ

|

విశాఖ నగరంలో అర్దరాత్రి సమయంలో కావ్య అనే యువతి హాహాకారాలు చేస్తూ కాలుతున్న శరీరంతో రోడ్ మీదకు పరుగెత్తుకొచ్చిన ఘటనలో మిస్టరీ వీడింది. కావ్యపై జరిగింది దాడా లేకా ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందా అన్న కోణంలో విచారణ చేసిన పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

ఆలయాల్లో పోలీసులు భద్రత కోసమా.. రౌడీయిజానికా..? కంచిలో భక్తులను కొట్టి చంపుతున్న ఖాకీలు?ఆలయాల్లో పోలీసులు భద్రత కోసమా.. రౌడీయిజానికా..? కంచిలో భక్తులను కొట్టి చంపుతున్న ఖాకీలు?

  వనపర్తి జిల్లా లో కనిమెట్ట హైవే బ్రిడ్జి కింద మృతదేహాం
  కావ్యపై జరిగింది దాడి కాదు .. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కావ్యనే అని తేల్చిన పోలీసులు

  కావ్యపై జరిగింది దాడి కాదు .. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కావ్యనే అని తేల్చిన పోలీసులు

  మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై ఒక యువతి మంటల్లో చిక్కుకున్న కేసు మిస్టరీ వీడింది . మంటల్లో కాలి 60 శాతం గాయాలపాలైన కావ్య విషయంలో జరిగిన ఘటనకు గల కారణాలను వెల్లడించడంతో పోలీసులు చిక్కుముడిని విప్పారు . తలా తోకా లేకుండా ఘటనపై సమాధానం చెప్పిన కావ్యను మరోసారి విచారించిన పోలీసులు అసలు నిజం రాబట్టారు. ఆమెపైన దుండగులు ఎవరూ దాడి చెయ్యలేదని, ఆమెనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అని పోలీసులు పేర్కొన్నారు.

  25ఏళ్ళ నర్సు కావ్య 45 ఏళ్ళ పెళ్ళైన అంబులెన్స్ డ్రైవర్ తో ప్రేమాయణం .. పెళ్లి చేసుకోమని ఒత్తిడి

  25ఏళ్ళ నర్సు కావ్య 45 ఏళ్ళ పెళ్ళైన అంబులెన్స్ డ్రైవర్ తో ప్రేమాయణం .. పెళ్లి చేసుకోమని ఒత్తిడి

  శ్రీకాకుళం జిల్లా బత్తిలికి చెందిన 25ఏళ్ళ కావ్య నగరంలో నర్సింగ్‌ కోర్సు చేసింది. తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో ఎంబీఏ చేసిన తన అక్క తో కలిసి విజయనగరంలోని అమ్మమ్మ ఇంట్లో ఉండేది. ఏడాది కిందట అక్కచెల్లెళ్లు ఇద్దరూ నగరానికి చేరుకుని ఇసుకతోట కూడలి సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కావ్య కేజీహెచ్‌ సమీపంలోని ఎంఆర్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కావ్యకు తాను పనిచేస్తున్న ఆస్పత్రికి రోగులకు తీసుకువచ్చే అంబులెన్స్‌ డ్రైవర్‌ 45 ఏళ్ళ చెన్నా నరేంద్ర తో ఏడాది కిందట ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఇక కొంతకాలంగా కావ్య తనను పెళ్లి చేసుకోవాలంటూ నరేంద్రను ఒత్తిడి చేస్తోంది. కానీ నరేంద్ర తనకు వివాహమైందని, ముగ్గురు పిల్లలు కూడా వున్నారని పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చిచెప్పేశాడు.

  పెళ్లి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం చేసిన కావ్య .. భయంతో పరారైన అంబులెన్స్ డ్రైవర్

  పెళ్లి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం చేసిన కావ్య .. భయంతో పరారైన అంబులెన్స్ డ్రైవర్

  దీంతో కావ్య మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు డ్యూటీ పూర్తయిన తర్వాత శివాజీపాలెం ప్రధాన రహదారి జంక్షన్‌కు రావాలని నరేంద్రకు ఫోన్ చేసింది .నరేంద్ర రావటంతో మళ్ళీ పెళ్లి గురించి గొడవకు దిగింది. అప్పటికే శరీరంపై పెట్రోలు పోసుకుని వున్న కావ్య తనను పెళ్లి చేసుకోకపోతే నిప్పంటించుకుని చనిపోతానని హెచ్చరించింది. అయినప్పటికీ తాను పెళ్లి చేసుకోలేనని నరేంద్ర చెప్పడంతో నిప్పంటించుకుంది. ఇక దీంతో ఆందోళనకు గురైన నరేంద్ర మంటలను చేతులతో ఆర్పేందుకు యత్నించాడు. కానీ అప్పటికే కావ్య శరీరమంతటికీ మంటలు వ్యాపించడంతో భయంతో నరేంద్ర అక్కడి నుంచిపారిపోయాడు . ఇక మంటలను ఆర్పే క్రమంలో అతని రెండు చేతులు కాలి గాయాలయ్యాయి. బాధితురాలు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఆమెపై అనుమానంతో విచారించిన పోలీసులకు కావ్య ప్రేమాయణం ఈ ఘటనకు కారణం అని తెలిసింది.

  English summary
  Mystery is witnessed when a young woman named Kavya rushes to the road with a burning body at midnight in Visakha city. Police investigated the matter of whether Kavya had committed suicide or whether anybody attacked on her . Police investigated the cause of the incident in which Kavya was involved in 60 percent of burn injuries.Kavya was again asked by the police and the truth was recovered. The police claimed that none of the assailants attacked her and that she attempted suicide due to a love affair with a married ambulance driver .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X