వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ పై దాడికి రెండు సార్లు య‌త్నం : ప‌క్కా ప‌ధ‌కం ప్ర‌కార‌మే : 2017 నుండే ప్ర‌ణాళిక‌లు..

|
Google Oneindia TeluguNews

వైసిపి అధినేత జ‌గ‌న్ పై దాడి ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగానే జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. 2017 నుండే జ‌గ‌న్ పై దాడి కోసం నిందితుడు ప్ర‌ణాళిక‌లు ర‌చించాడు. అంతుకు ముందు రెండు సార్లు ఇదే త‌ర‌హా దాడి కోసం ప్ర‌య‌త్నిం చాడు. 92 మంది సాక్షులను విచారించి, స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేసాం. దాడికి ఉపయోగించిన కోడిపందేల కత్తికి నింది తుడు రెండుసార్లు పదును పెట్టాడని పోలీసులు వెల్ల‌డించారు.

2017 డిసెంబ‌ర్ నుండే ప్ర‌ణాళిక‌..

2017 డిసెంబ‌ర్ నుండే ప్ర‌ణాళిక‌..

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై పక్కా పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ మహే ష్‌ చంద్ర లడ్డా తెలిపారు. నిందితుడు 2017 డిసెంబర్ నుండే వైఎస్‌ జగన్ హత్యపై కార్యాచరణ ప్రారంభించాడని పేర్కొన్నారు. అక్టోబర్‌ 18నే దాడికి పథక రచన చేశాడని.. అక్టోబర్‌ 17నే వైఎస్‌ జగన్‌ విశాఖ నుంచి వెళ్లిపోవడంతో అతడి పథకం ఫలించలేదన్నారు. జనవరి 2018 కర్ణాటకలో తనతో పనిచేసిన వెంకటపతి అనే వ్యక్తి ద్వారా ఫ్యూజన్ ఫుడ్స్ లో చేరాడన్నారు. 164 సీఆర్ పీసీ కింద ఇప్పటి వరకు 92 మంది సాక్షులను విచారించి, స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేసామ‌ని వివ‌రించారు. దాడికి ఉపయోగించిన కోడిపందేల కత్తికి నిందితుడు రెండుసార్లు పదును పెట్టాడని వివ‌రిం చారు. నిందితుడు శ్రీనివాస్‌ వెల్డర్‌గా, కేక్‌ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు.

దాడి జ‌రిగిన రోజు..క‌త్తికి సాన పట్టించి..

దాడి జ‌రిగిన రోజు..క‌త్తికి సాన పట్టించి..

దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్‌ కోడికత్తికి సాన పట్టించాడని.. దీన్ని అతడి సహచరులు కూడా చూశారని సీపీ చెప్పారు. దాడి జరిగిన రోజు పక్కా ప్రణాళికతో ఇంటి నుంచి శ్రీనివాస్‌ ఉదయం 4.55 గంటలకే బయల్దేరాడని... ఉదయం 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్‌ చేసి రోజు నన్ను టీవీలో చూస్తారు అని, అమ్మాజీతో ఒక సంచలనం చూస్తారు అని పలుమార్లు శ్రీనివాస్‌ చెప్పాడని సీపీ పేర్కొన్నారు. అదే రోజు ఉదయం 9గంటల సమ యంలో రెస్టారెంట్‌లో కూడా కోడికత్తికి సానపెట్టాడని తెలిపారు. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్‌ చేశాడని, హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో వైకాపా నేత ధర్మశ్రీతో జగన్‌ మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్‌ దాడి చేశాడని లడ్డా వెల్లడించారు.

ముందుగానే ఫ్లెక్సీ త‌యారు చేయించి.. దాడికి తెగ‌బ‌డి

ముందుగానే ఫ్లెక్సీ త‌యారు చేయించి.. దాడికి తెగ‌బ‌డి

నిందితుడు శ్రీనివాస్ 2017 జనవరిలో జగన్‌తో ఉన్న ఫ్లెక్సీని తయారు చేయించాడని పోలీసుల విచార‌ణ లో వెల్ల‌డైం ది. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొ ని గంటల్లోనే వివరాలు చెప్పాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. జగన్‌పై విష ప్రయోగం చేయాలనే ఉద్దేశం నిందితుడికి లేదనే విషయం విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. తనపై దాడి ఘటనపై జగన్‌ ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదు చే యలేదన్నారు. హైకోర్టు తాము చెప్పేదాకా ఛార్జిషీట్‌ దాఖలు చేయవద్దని చెప్పిందని సీపీ ల‌డ్హా వివరించారు. అయితే ఈ కేసును స్వ‌తంత్ర విచార‌ణ సంస్థ‌కు అప్ప‌గించాల‌ని ఇప్ప‌టికే వైసిపి కోర్టులో పిటీష‌న్ వేసింది. దీని పై కోర్టులో విచార‌ణ సాగుతోంది. ఇక‌, రాజ‌కీయంగానూ ఈ కేసు అధికార - విప‌క్షాల మ‌ధ్య యుద్దానికి దారి తీసింది.

English summary
Visakha Police Commissioner revealed attempt on Jagan in air port. Srinivas two times tried for attack Jagan. C.P says only for sensation accused attacked on Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X