అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడలో శుక్రవారం అంగన్ వాడీ కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడించేందుకు అంగన్ వాడీలు ప్రయత్నించారు. దీంతో బందర్ రోడ్డులో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతమంది అంగన్ వాడీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్ వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న అంగన్ వాడీ కార్యకర్తల అరెస్ట్‌లకు నిరసనగా, పెంచిన జీతాల్లో కోత విధిస్తూ అంసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు నిరసనగా అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్ వాడీలు శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు.

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

కాంప్లెక్స్ నుండి లోయర్ ట్యాంకుబండ్ రోడ్ మయూరి హోటల్ కూడలి మీదుగా ర్యాలీ కాంప్లెక్స్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విధంగా శుక్రవారం అసెంబ్లీలో బాబు ప్రకటన వెలువేడలేదని అన్నారు.

 అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్‌వాడీ టీచర్‌కు 7100 రూపాయలు పెంచుతామని చెప్పారని కానీ కేంద్రంనుండి ఐసిడిఎస్ కు వస్తున్న నిధులు తగ్గినందున 7000 మాత్రమే పెంచుతూ చేసిన ప్రకటనను తాము నమ్మలేక పోతున్నామని పేర్కొన్నారు. పెంచుతామని ముందుగా ఇచ్చిన హామీ మేరకు ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేసారు.

 అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంతేకాకుండా ఏప్రియల్ నుండి పెంచిన జీతాలు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు అంగన్‌వాడీల విషయంలో పచ్చిమోసంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం నుండి నిధులు తగ్గాయని చెపుతున్న ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు, జీతాలు ఏమైనా తగ్గించుకున్నారా అని ప్రశ్శించారు.

 అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు (ఫోటోలు)

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు (ఫోటోలు)

కోత విధించడానికి కష్టజీవుల వేతనాలే కనిపించాయా అంటూ నిలదీసారు. ఏప్రియల్ నుండి ఏమి చేస్తారనేది స్పష్టతలేదని అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెంచిన జీతాలు అమలు కోరుతూ విజయవాడలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనను అడ్డుకుని అక్రమంగా అరెస్ట్‌లు చేయడాన్ని ఆయన ఖండించారు.

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

అంగన్‌వాడీ కార్యకర్తకు పోలీస్ వార్నింగ్: సొమ్మసిల్లి పడిపోయారు

ఇచ్చిన హామీ పూర్తిగా అమలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేసారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, అధ్యక్షురాలు పైడిరాజు, సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి టివి రమణ, బొత్స సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

English summary
Police rude behaviour Anganwadi protest at vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X