విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'లావణ్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేవు': మృతికి కారణం ఇదీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలోని విశాఖలో దాదాపు పది రోజుల క్రితం లావణ్య అనే మహిళ మృతి చెందారు. నలుగురు యువకులు కారుతో ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టడం వల్ల మృతి చెందారు. ఈ కేసు విషయమై పోలీసులు సోమవారం నాడు స్పందించారు.

లావణ్య మృతి కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు విశాఖ నగర పోలీసు కమిషనర్‌ యోగానంద్‌ ఈ రోజు తెలిపారు. ఈ కేసులో నిష్ఫక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాఫ్తు విషయంలో పోలీసులపై ఒత్తిడి లేదన్నారు.

ఈ కేసులో నిందితులను తప్పించేందుకు రాజకీయ నేతలు ఒత్తిళ్లు వస్తున్నాయన్న మీడియా వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించవలసి ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఏం జరిగింది?: వేధించి, వెంటాడి ప్రాణం తీసిన కేసులో పురోగతిఏం జరిగింది?: వేధించి, వెంటాడి ప్రాణం తీసిన కేసులో పురోగతి

Police says there is no pressure in Lavanya's death case

అనకాపల్లికి చెందిన హేమంత్ కుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను వేధించారని, వారికి హానీ తలపెట్టాలనే ఉద్దేశ్యంతో కారుతో ఢీకొట్టారని మీడియాలో వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని చెప్పారు.

తాగిన మైకంలో హేమంత్ కుమార్ తన కారుతో లావణ్య ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టారన్నారు. హేమంత్ కుమార్ తాగిన మైకంలో ఉండటంతో పాటు ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్నాడని, అందుకే ప్రమాదం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. దర్యాఫ్తు ఇంకా కొనసాగుతోందని, నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.

English summary
Vishaka police says there is no pressure in Lavanya's death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X