వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతమనేనిపై 50 కేసులు .. గాలిస్తున్న 12 బృందాలు ..పోలీసులపై వేటు

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది . కోడెల ఇప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి ఉంటే యరపతినేని, కూన రవి కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇక తాజాగా యరపతినేని బాటలో చింతమనేనికి కూడా ఉచ్చు బిగుస్తుంది. చింతమనేనిపై ఇటీవల ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీకేసు నమోదు అయిన నేపధ్యంలో చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇక ఆయనను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చెయ్యలేకపోయారు. ఆయన కోసం 12 బృందాల పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు.

గులాబీ గూటిలో అసమ్మతి గళాలు .. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో అంతర్యుద్ధంగులాబీ గూటిలో అసమ్మతి గళాలు .. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసుల వ్యవహారం జగన్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. చింతమనేని ఆచూకీ కోసం 12 స్పెషల్ పోలీస్ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే చింతమనేని ఏలూరు కోర్టులో లొంగిపోతాడన్న ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ పోలీసులు మోహరించారు. ఆయన అరెస్ట్‌కు సంబంధించి దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇక చింతమనేనిపై కేసు పెట్టిన యువకులకు ఆయన మనుషుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు వారు పోలీసులకు చెప్తున్నారు .కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నట్టు వారు పోలీసులకు విన్నమించుకున్నారు .

Police search for Chintamaneni.. department action on police

గతంలో చింతమనేనిపై నమోదైన 50 కేసులకు సంబంధించిన ఫిర్యాదుదారులతో ఇవాళ ఎస్పీ నవదీప్ సింగ్ పిలిపించి విచారణ జరిపారు. ఆ తర్వాత పోలీసులపై చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. చింతమనేని ప్రభాకర్ పై నమోదైన కేసుల విచారణలో సరిగ్గా వ్యవహరించని పోలీసులపై వేటు పడింది. ఏలూరు త్రీ టౌన్ సీఐ, ఎస్సై లతో పాటు పెదవేగి ఎస్సైలపై చర్యలకు ఎస్పీ ఆదేశించారు. ఏలూరు త్రీ టౌన్సీఐని సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. మరో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.

English summary
Jagan government very serious on Former MLA Chintamaneni Prabhakar cases. Twelve special police teams are on the lookout for Chintamani's where abouts.In the 50 cases of Chintamani, police have failed to act properly so, higher officials taken the departmental action on the police .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X