కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీయం ర‌మేష్ ఇంటి పై పోలీసులు దాడులు : ఎస్పీ ఆదేశాల మేర‌కే : సీయం సీరియ‌స్‌..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ క‌డ‌ప జిల్లాలోని టిడిపి నేత‌లు లక్ష్యంగా మారుతున్నారు. మైదుకూరు అభ్య‌ర్ది పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పై ఐటి దాడులు జ‌రిగ్గా..ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ నివాసం లో పోలీసులు దాడులు చేసారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేర‌కే ఈ దాడులు జ‌రుగుతున్నాయ‌ని సోదాల్లో పాల్గొన్న పోలీసు అధికారులు చెబుతున్నారు.

సీయం ర‌మేష్ నివాసంలో..

సీయం ర‌మేష్ నివాసంలో..

టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ నివాసం పై పోలీసులు దాడి చేసారు. క‌డ‌ప జిల్లాలోని పోట్ల‌దుర్తితోని ఆయ‌న నివాసం లో దాదాపు 50 మంది పోలీసులు ప్ర‌వేశించి సోదాలు నిర్వ‌హించారు. స‌డ‌న్ గా పోలీసులు ఇంటి వ‌ద్ద‌కు రావ టంతో సీయం ర‌మేష్ వారిని నిల‌దీసారు. వారు బెడ్ రూం లో సైతం ప్ర‌వేశించ‌టం పై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చే సారు. దీని పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ర‌మేష్ సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. దీని తో ఎన్నిక‌ల కోడ్ ఉన్న స‌మ‌యంలో వారెంట్ అస‌వ‌రం లేద‌ని పోలీసులు తేల్చి చెప్పారు. అదే స‌మ‌యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేర‌కే ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నామంటూ స్ప‌ష్టం చేసారు.

కొత్త ఎస్పీ ఆదేశాల మేర‌కే..

కొత్త ఎస్పీ ఆదేశాల మేర‌కే..

కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు క‌డ‌ప ఎస్పీగా రాహుల్ దేవ్ శ‌ర్మ ఉండేవారు. ఎన్నిక‌ల సంఘం ఆయ‌న్ను బ‌దిలీ చేసింది. ఆయ‌న స్థానంలో తాజాగా అభిషేక్ మ‌హంతిని ఎస్పీగా నియ‌మించారు. అయితే, ఇప్పుడు ఏకంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు నివాసంలో సోదాలు నిర్వ‌హించ‌టం తో దీని పై టిడిపి నేత‌లు మండిప‌డుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే పోలీ సులు దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. క‌డ‌ప జిల్లాలో ర‌మేష్ టిడిపి లో కీల‌క నేత‌గా ఉన్నారు. ఆయ‌న అక్క‌డ పోటీ చేస్తున్న పార్టీ అభ్య‌ర్దుల‌కు ఆర్దికంగా సాయం అందిస్తున్నార‌నే ఫిర్యాదులు ఉన్న‌ట్లు తెలుస్తోం ది. దీంతో..సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగానే ఈ సోదాలు అని పోలీసులు చెబుతున్నా..త‌మ‌కు వ‌చ్చిన ఫిర్యాదుల ఆధా రంగానే సోదాలు చేస్తున్న‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే, టిడిపి నేత‌లు మాత్రం ఇదంతా కేంద్ర ప్ర‌భు త్వ ఆదేశాల మేర‌కు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపిస్తున్నారు.

జ‌గ‌న్ కంట్రోల్ లో ఇసి ఉందా...

జ‌గ‌న్ కంట్రోల్ లో ఇసి ఉందా...

ఎన్నిక‌ల సంఘం జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు ప‌ని చేస్తుందా అనే అనుమానం క‌లుగుతుంద‌ని టిటిపి నేత‌లు అంటున్నా రు. తాజాగా, మైదుకూరు టిడిపి అభ్య‌ర్ది పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నివాసం పై ఐటి సోదాలు జ‌రిగాయి. ఆ వెంట‌నే పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ నివాసంలో జిల్లా పోలీసులు సోదాలు చేసారు. దీని పై ముఖ్య‌మంత్రి చం ద్ర‌బాబు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యం లో టిడిపి నేత‌లు..కార్య‌క‌ర్త‌ల మ‌నోస్థైర్యం దెబ్బ తీయ‌టం కోస‌మే ఢిల్లీ నుండి వ‌స్తున్న ఆదేశాల మేర‌కు ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయ‌నే అనుమానం వ్య‌క్తం చేస్తు న్నారు. అయితే, సోదాల్లో ఏమీ దొర‌క‌లేద‌ని సీయం ర‌మేష్ అనుచ‌రులు చెబుతున్నారు.

English summary
Kadapa dist police searches in TDP Rajya Sabha Mp CM Ramesh House in Potladurthi. C.M Ramesh serious on police searches in his house. CHandra babu also angry on police raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X