విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టుల కట్టడికి డ్రోన్ల వినియోగం...సెర్చింగే కాదు బ్లాస్టింగ్స్ కూడా!;మరి వాళ్లూ డ్రోన్లు వాడిత

|
Google Oneindia TeluguNews

అమరావతి:శాంతిభద్రతలకు పెను ముప్పుగా పరిణమించిన మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్ర హోం శాఖ కొత్త కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. ఇందుకోసం లేటెస్ట్ టెక్నాలజీని విరివిగా వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఎపిలో మావోయిస్ట్ లు ఒక్కసారిగా విరుచుకుపడటంపై దృష్టిసారించిన కేంద్ర హోం శాఖ తమ సరి కొత్త ప్రణాళికలను ఇక్కడి నుంచే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా మావోయిస్టుల కదలికలు పసిగట్టేందుకు, వారిని దెబ్బతీసేందుకు డ్రోన్లను వినియోగించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించినట్లు తెలిసింది. అయితే హోం శాఖ ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దేశంలోనే తొలిసారిగా...ఏవోబీలో

దేశంలోనే తొలిసారిగా...ఏవోబీలో

దేశంలోనే తొలిసారిగా ఏవోబీలో మావోయిస్టుల కట్టడికి డ్రోన్లను ప్రయోగించడం ఖాయంగా కనిపిస్తోంది. దట్టమైన అడవిలో అణువణువు క్షుణ్ణంగా తెలిసిన మావోయిస్టులపై పైచేయి సాధించాలంటే డ్రోన్ల సహకారం తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుందనేది భద్రతా అధికారుల భావనగా తెలుస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి వారి కదలికలను పసిగట్టాలని ఆదేశించారట. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించినట్లు తెలిసింది.

5 రకాల డ్రోన్లు...వినియోగం

5 రకాల డ్రోన్లు...వినియోగం

దేశవ్యాప్తంగా తీవ్రవాదం సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఉన్న పది రాష్ట్రాల్లో ఈ డ్రోన్ల ప్రయోగం జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 5 రకాలైన డ్రోన్లను వినియోగించాలని భావిస్తున్నారని తెలిసింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ మార్గదర్శకాలను అనుసరించి వాటిని ఈ ప్రయోగంలో వినియోగించనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్‌ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువు ఉండే లార్జ్‌ డ్రోన్లను ఇందుకోసం ఉపయోగించాలని భావిస్తున్నారట.

 వినియోగం...ఎలా అంటే?

వినియోగం...ఎలా అంటే?

ముందుగా కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్‌ బలగాలకు ఈ డ్రోన్లను అందించనున్నారు. ఈ మేరకు ప్రతి సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంపులో 2 నుంచి 4 డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్‌పీఎఫ్‌ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఎక్కువగా ఉపయోగించాలని...వీటికి 350 నుంచి 450 అడుగుల వరకు ఎగిరే శక్తి ఉంటుండం అడ్వాంటేజ్ గా భావిస్తున్నారు. వీటిని ఉపయోగించి పగటి పూట హెచ్‌డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులభమని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

సెర్చింగే కాదు...ఫైరింగ్,బ్లాస్టింగ్ కూడా

సెర్చింగే కాదు...ఫైరింగ్,బ్లాస్టింగ్ కూడా

ముందుగా ఇటీవలే మావోయిస్టుల దాడి జరిగిన ఆంధ్రప్రదేశ్‌ తో పాటు ఇవే మావో దళాల ప్రాబల్యం ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్,తెలంగాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో ఈ డ్రోన్లను ప్రయోగించి నక్సలైట్ల కదలికలను గుర్తించేలా ఈ డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారట. ఇందుకోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేయడం జరుగుతుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో మావోల ఉనికి కనుగొనడంతో పాటు మావోల కోసం అడవుల్లో కూంబింగ్‌ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపడానికి కూడా ఇవి ఉపయోగపడనున్నాయని తెలిసింది. అంతేకాదు అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా ఈ డ్రోన్లనే ఉపయోగిస్తారని...అలాగే మావోయిస్టులు ఉన్న ప్రాంతాల్లో నేరుగా బాంబులు ఉన్న డ్రోన్‌ (సూసైడ్‌ డ్రోన్‌)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారట.

మరివాళ్లూ...డ్రోన్లు సమకూర్చుకుంటే?

మరివాళ్లూ...డ్రోన్లు సమకూర్చుకుంటే?

అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపైనే పోలీసు అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులు వాడుతున్న అన్ని రకాల ఆయుధాలను,టెక్నాలజీలను వినియోగిస్తున్న మావోయిస్టులు రేపు వారు కూడా ఈ డ్రోన్ల వినియోగానికి దిగితే పరిస్థితి ఏమిటనేది మాజీ సీనియర్ పోలీసు అధికారుల ప్రశ్నగా ఉంది. మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను ఏ విధంగా అయితే సమకూర్చుకోగలుగుతున్నారో అదే విధంగా డ్రోన్లను తెప్పించుకోవడం వారికి పెద్ద సమస్య కాకపోవచ్చని వారంటున్నారు. అదే జరిగితే మావోలు నిర్జన అరణ్యాలలో ఉంటారు కాబట్టి దాడులు జరిపినా నష్టం వారికేనని...అదే మావోలు డ్రోన్ల ద్వారా జనావాసాల్లోని నిర్ణీత వ్యక్తులపై డ్రోన్ల ద్వారా టార్గెట్ పెడితే జరిగే నష్టం అపారం అనేది గుర్తించాలని వారు విశ్లేషిస్తున్నారు. భద్రతా దళాలు ఆ కోణంలో కూడా ఆలోచించే ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.

English summary
Visakhapatnam:The Home Ministry has directed to Police to use the drones to detect the movements of the Maoists and to eradicate them. But, various opinions are arising over Home Department's this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X