వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు మాధ‌వ్ నామినేష‌న్ ఆమోదం : ఉత్కంఠ‌కు తెర : ఇక‌..ఎన్నిక‌ల గోదాలో..!

|
Google Oneindia TeluguNews

పోలీసు మాధ‌వ్ నామినేష‌న్ ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర ప‌డింది. ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు లైన్ క్లియ‌ర్ అయింది. నా మినేష‌న్ ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ఆమోదించారు. పోలీసు ఉద్యోగానికి స్వ‌చ్చంద రాజీనామా చేసిన మాధ వ్ ను ప్ర‌భుత్వ ఉద్దేశ పూర్వ‌కంగా రాజీనామానున ఆమోదించుకుండా వేధిస్తోంద‌ని మాధ‌వ్ ఎన్నిక‌ల సంఘాన్ని ..ట్రిబ్యున‌ల్ ను ఆశ్ర‌యించారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేర‌కు మాధ‌వ్ కు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు అనుమ‌తి ల‌భించింది.

నామినేష‌న్ ఆమోదం..
హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్‌ నామినేషన్‌ను స్క్రూటీని చేసిన త‌రువాత ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్‌ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించింది.

Polie Madhav Nomination accepted : YCP tension clear

అందులో భాగంగా ట్రిబ్యునల్‌ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యు నల్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దీంతో..హిందూపురం ఎంపీగా మాధ‌వ్ పోటీలో ఉన్నారు.

కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిది.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: పోలీస్ మాధవ్కోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిది.. బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారు: పోలీస్ మాధవ్

పోరాడి సాధించిన మాధ‌వ్..
జేసి బ్ర‌ద‌ర్స్ మీద మీసం మెలేసి..ఆ త‌రువాత రాజ‌కీయంగా అనూహ్యంగా మాధ‌వ్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. అంతే అనూహ్యంగా హిందూపూర్ ఎంపి అభ్య‌ర్దిగా ఖ‌రార‌య్యారు. అప్ప‌టి నుండి ఆయ‌న త‌న రాజీనామా కోసం ప్ర‌త్నాలు చే స్తూనే ఉన్నారు. అయితే, ప్ర‌భుత్వం సైతం అదే స్థాయిలో ఆమోదం తెల‌ప‌కుండా పెండింగ్ లో పెట్టింది. దీని పై మాధ‌వ్ ఎన్నిక‌ల సంఘాన్ని..ట్రిబ్యున‌ల్ ఆశ్ర‌యించారు. ట్రిబ్యున‌ల్ మాధ‌వ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా..దీని పై ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్లింది.

Polie Madhav Nomination accepted : YCP tension clear

అక్క‌డ వారి అభ్య‌ర్దన ను హైకోర్టు స్టే కు నిరాక‌రించింది. సోమ‌వారం హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాధవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలను కూడా రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన భార్య సునీతతో కూడా నామినేషన్‌ దాఖలు చేయించారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్‌లను పరిశీలించిన ఎన్నికల అధికారులు మాధవ్‌ నామినేషన్‌ను ఆమోదించినట్టు ప్రకటించారు.

English summary
Police Madhav nomination accepted by Returning officer. Madhav contesting from Hindupur Loksabha as YCP candidate. after High court direction Govt accepted Madhav resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X