వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏది నిజం...వైసీపీ ప్రభుత్వంపై కుట్ర: టీడీపీయే లేఖ సృష్టించిందా: డీజీపీ వద్దకు పంచాయితీ...!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో వైరల్ అయిన లేఖ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. ఈ లేఖ తాను రాయలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేసారు. దీంతో.. వైసీపీ నేరుగా టీడీపీని టార్గెట్ చేసింది. టీడీపీ తమ మద్దతు మీడియా ద్వారా ఈ లేఖను ప్రచారం చేసి..ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు కుట్ర చేసిందంటూ ఆరోపించింది. దీని పైన టీడీపీ మాత్రం అధికారకంగా స్పందించలేదు. ఎన్నికల కమిషనర్ మెయిల్ నుండే కేంద్ర హోం శాఖకు లేఖ మెయిల్ వెళ్లిందంటూ ప్రచారం సాగింది. అసలు..తాను లేఖ రాయలేదని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేయటంతో..ప్రభుత్వం పైన కుట్రగా భావిస్తున్న వైసీపీ నేతలు దీని పైన డీజీపీని కలవాలని నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ చేయాలని కోరనున్నారు. దీంతో..ఇప్పుడు ఇది కొత్త టర్న్ తీసుకుంది.

 కుట్ర జరుగుతుందంటూ..

కుట్ర జరుగుతుందంటూ..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో హఠాత్తుగా తెర పైకి వచ్చిన లేఖ..కాసేపటితో రాష్ట్రంలో వైరల్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖకు రాసినట్లుగా చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం లేఖ సిద్దం చేసారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డామేజ్ చేసే కుట్రలో భాగంగా విమర్శించారు. రమేష్ కుమార లెటర్ హెడ్ మీద బయటకు వచ్చిన ఈ లేఖ టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని ఆ లేఖలో ఉంది.

 నిఘా వర్గాల నుంచి వైసీపీ సమాచారం

నిఘా వర్గాల నుంచి వైసీపీ సమాచారం

ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఉద్దేశాలను లేఖలో తప్పుబట్టారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను రమేశ్‌ కుమార్‌ కోరినట్లు లేఖలో ఉంది. దీంతో..వైసీపీ అసలు ఏం జరిగిందనే అంశం పైన నిఘా వర్గాల నుండి సమాచారం సేకరించింది. ఇదే ససమయంలో ఎన్నికల కమిషనర్ తాను లేఖ రాయలేదని స్పష్టం చేసారు. దీంతో..ఇది టీడీపీ పనే అంటూ వైసీపీ రాజకీయ దాడి మొదలు పెట్టింది.

 లేఖలో లేని కరోనావైరస్ ప్రస్తావన

లేఖలో లేని కరోనావైరస్ ప్రస్తావన

రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తూ..లేఖ రాసినట్లుగా ఒక లేక రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆయన రాసినట్లుగా ప్రచారం సాగిన ఆ లేఖలో అనేక అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. లేఖలో కరోనా వైరస్‌ ప్రస్తావనే లేదు. శాంతి భద్రతలపై సందేహాలు, ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే మరి సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించ లేదని వైసీపీ నేతలకు అనుమానం మొదలైంది.

Recommended Video

Coronavirus In India : Paracetamol Sufficient For COVID 19, Trolls On KCR And Jagan
 రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చేసారు..

రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చేసారు..

ఇక, ఈ వ్యవహారం పైన రాజకీయంగా దుమారం చెలరేగటంతో..పొద్దు పోయిన తరువాత ఏఎన్ఐకి రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. తాను ఎటువంటి లేఖ రాయలేదని స్పస్టం చేసారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారానని సీరియస్ గా తీసుకుది. వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. మరి..తాను రాయకుండా తాను రాసినట్లుగా వైరల్ అయిన లేఖ పైనా ఇప్పుడు రమేష్ కుమార్ సైతం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. అయితే, తమ పైన వస్తున్న విమర్శలకు టీడీపీ ఏ రకంగా స్పందిస్తుదనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం పైన ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.

English summary
The letter that had circulated in the name of SEC Ramesh Kumar is now becoming a big headache as the former had given a clarification that it was a fabricated one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X