వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రాజ‌కీయాల్లో అస‌లు కిక్కు ఇదే: ఒకే కుటుంబం..వేర్వేరు పార్టీలు: ఎన్నిక‌ల బ‌రిలో..గెలిచేదెవ‌రు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజ‌కీయాలంటేనే అస‌లైన మ‌జా. అటువంటి రాష్ట్రంలో ఇక ఒకే కుటుంబం నుండి రెండు వేర్వేరు పార్టీల అభ్య‌ర్దులుగా త‌ల ప‌డితే ఆ పోటీయే వేరు. అన్నా ద‌మ్ములు..అన్నా-చెల్లెలు, బాబ‌-మామ్మ‌ర్దులు, మామ‌-అల్లుళ్ల‌, భార్యా-భ‌ర్త‌లు..ఇలా ఎన్నో బంధాలు ఉన్నా..రాజ‌కీయాల్లో మాత్రం గెలుపుతోనే అస‌లు కిక్కు. ఎన్నిక‌ల బ‌రిలో ఉండి.. మ‌రి కొద్ది గంట‌ల్లో ఫ‌లితాలు వెల్ల‌డి కానున్న ప‌రిస్థితుల్లో బంధుత్వాలు ఉండి వేర్వేరు పార్టీల అభ్య‌ర్దులుగా పోటీ చేసి ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక‌సారి ప‌రిశీలిస్తే..

అన్నదమ్ములు:— అన్న-చెల్లెలు..

అన్నదమ్ములు:— అన్న-చెల్లెలు..

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒకే కుటుంబం నుండి పోటీ చేసిన అన్న‌ద‌మ్ములు చాలా మందే ఉన్నారు. వారిలో శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన సోద‌రులు క‌నిపిస్తారు. ఇద్ద‌రూ ఒకే పార్టీ నుండి పోటీ చేసారు. దర్శాన ప్రసాదరావు శ్రీకాకుళం..వైసీపీ అభ్య‌ర్దిగా.. ఆయ‌న సోద‌రుడు దర్మాన కృష్ణదాసు..నరసన్నపేట నుండి వైసీపీ అభ్య‌ర్దిగా పోటీలో ఉన్నారు. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా నుండి బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి నుండి వైసీపీ అభ్య‌ర్దిగా ఉండ‌గా, ఆయ‌న సోద‌రుడు బొత్స అప్పలనరసయ్య, గజపతినగరం నుండి వైసీపీ అభ్య‌ర్దిగా పోటీలో ఉన్నారు. ఇక‌, జోత్యుల నెహ్రూ ,జగ్గంపేట నుండి టీడీపీ అభ్య‌ర్దిగా..ఆయ‌న సోద‌రుడు జోత్యుల చంటిబాబు అదే నియోజ‌క‌వ‌ర్గం నుండి వైసీపీ అభ్య‌ర్దిగా బ‌రిలో నిలిచారు. ఇక‌, చిరంజీవి పెద్ద సోద‌రుడు కొణిదెల నాగబాబు ..నరసాపురం లోక్ స‌భ స్థానం నుండి పోటీలో ఉండ‌గా..మ‌రో సోద‌రుడు కొణిదెల పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా..ఇద్ద‌రూ జ‌న‌సేన నుండి పోటీ చేస్తున్నారు. బుడ్డా రాజశేర్ రెడ్డి ..శ్రీశైలం టీడీపీ అభ్య‌ర్దిగా..ఆయ‌న సోద‌రుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిఅదే నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ అభ్య‌ర్దిగా బ‌రిలో నిలిచారు. పాణ్యం నుండి కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, బ‌న‌గాన‌ల్లె నుండి కాట‌సాని రామిరెడ్డి ఇద్ద‌రూ వైసీపీ నుండే పోటీలో ఉన్నారు.జేసీ బ్ర‌ద‌ర్స్ త‌న‌యుడు ప‌వ‌న్ రెడ్డి అనంత‌పురం ఎంపీగా, ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిప‌త్రి అభ్య‌ర్దిగా టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు. రాజాం నియోజ‌వ‌ర్గం నుండి వైసీపీ అభ్య‌ర్దిగా కంబాల జోగులు పోటీలో ఉండ‌గా..ఆయ‌న సోద‌రుడు అదే నియోజ‌వ‌ర్గం నుండి కాంగ్రెస్ అభ్య‌ర్దిగా పోటీ చేస్తున్నారు. కురుపాం నుండి నిమ్మ‌క జ‌య‌రాజ్ బీజేపీ అభ్య‌ర్దిగా..సోద‌రుడు నిమ్మ‌క జ‌య‌కృష్న పాల‌కొండ నుండి టీడీపీ అభ్య‌ర్దులుగా నిలిచారు. ఇక‌, నంద్యాల నుండి బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఆళ్ల‌గ‌డ్డ నుండి అఖిల‌ప్రియ ఇద్ద‌రూ టీడ‌పీ నుండే బ‌రిలో నిలిచారు.

బ‌రిలో తండ్రి, కుమారులు, కుమార్తెలు

బ‌రిలో తండ్రి, కుమారులు, కుమార్తెలు

విజ‌య‌న‌గ‌రం టీడీపీ ఎంపీ అభ్య‌ర్దిగా పి. అశోక్ గజపతిరాజు పోటీలో ఉండ‌గా..ఆయ‌న కుమార్తె అదితి విజయలక్ష్శి గజపతిరాజు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యేగా టీడీపీ నుండి పోటీలో ఉన్నారు. అర‌కు లోక్‌స‌భ నుండి కిషోర్ చంద్ర దేవ్ టీడీపీ ఎంపీగా పోటీలో ఉంటే..ఆయ‌న కుమార్తె కాంగ్రెస్ నుండి అర‌కు ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. పుంగ‌నూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్య‌ర్దిగా మిధున్ రెడ్డి వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక‌, కుప్పం నుండి చంద్ర‌బాబు..మంగ‌ళ‌గిరి నుండి నారా లోకేశ్ టీడీపీ నుండి బ‌రిలో నిలిచారు.

ఎన్నిక‌ల బ‌రిలో భార్య భర్తలు..

ఎన్నిక‌ల బ‌రిలో భార్య భర్తలు..

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో భార్య‌-భ‌ర్త‌లు సైతం పోటీలో ఉన్నారు. వారిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పర్చూరు నుండి వైసీపీ అభ్య‌ర్దిగా పోటీ చేస్తుంటే..ఆయ‌న స‌తీమ‌ణి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విశాఖ ఎంపీగా బీజేపీ నుండి పోటీలో ఉన్నారు. క‌ర్నూలు ఎంపీగా కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి..ఆయ‌న స‌తీమ‌ణి కోట్ల సుజాత‌మ్మ అలూరు ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు.

మేనమామ- మేనల్లుడు -మామ అల్లుళ్లు

మేనమామ- మేనల్లుడు -మామ అల్లుళ్లు

ఈ ఎన్నిక‌ల్లో మేనమామ- మేనల్లుడు -మామ అల్లుళ్లు సైతం పోటీ ప‌డ్డారు. వారిలో పి రవీంద్రనాధ్ రెడ్డి క‌మాల‌పురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే..ఆయ‌న మేన‌ల్లుడు జ‌గ‌న్ పులివెందుల నుండి బ‌రిలో నిలిచారు. త‌మ్మినేని సీతారాం వైసీపీ నుండి ఆముదాలవలస‌లో పోటీ చేస్తుంటే..ఆయ‌న ప్ర‌త్య‌ర్ధిగా టీడీపీ నుండి ఆయ‌న మేన‌ల్లుడు కూన ర‌వికుమార్ నిలిచారు. పెందుర్తి నుండి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి పోటీలో ఉండ‌గా..ఆయ‌న అల్లుడు రామ్మెహ‌న నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీలో నిలిచారు. ఇక‌, నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపూర్ నుండి టీడీపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉండ‌గా.. ఆయ‌న అల్లుడు నారా లోకేశ్ మంగ‌ళ‌గిరి నుండి..మ‌రో అల్లుడు భ‌ర‌త్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు.

బావ-బామ్మర్ధులు, మరదళ్లు

బావ-బామ్మర్ధులు, మరదళ్లు

మోదుగుల వేణుగోపాలరెడ్డి..గుంటూరు ఎంపీగా వైసీపీ నుండి పోటీ చేస్తుంటే ఆయ‌న బామ్మ‌ర్ది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక‌, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. సర్వేపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుండి బ‌రి లో ఉండ‌గా.. ఆయ‌న బామ్మ‌ర్ది న‌ల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ నుండి కోవూరు నుండి పోటీలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ప‌ల‌మ‌నేరు నుండి టీడీపీ అభ్య‌ర్దిగా ఎన్ అమరనాధ్ రెడ్డి పోటీ చేస్తుంటే.ఆయ‌న మ‌ర‌ద‌లు ఎన్ . అనీషారెడ్డి పుంగ‌నూరు నుండి టీడీపీ అభ్య‌ర్దిగా పోటీ చేస్తున్నారు.

వియ్యంకులు

వియ్యంకులు

నారా చంద్రబాబు నాయుడు(కుప్పం).. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తున్నారు. అదే విధంగా మంత్రులు గంటా శ్రీనావాసరావు-విశాఖపట్నంఉత్తరం నుండి బ‌రిలో ఉండ‌గా..ఆయ‌న వియ్యంకుడు పి.నారాయణ -నెల్లూరు అర్భన్ నుండి పోటీ చేస్తున్నారు. మ‌రో వియ్యంకుడు పి.రామాంజనేయులు-భీమవరం నుండి పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురూ టీడీపీ అభ్య‌ర్దులే. ఇక‌, కాకినాడ అర్బ‌న్ నుండి వైసీపీ అభ్య‌ర్దిగా పోటీలో ఉన్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తుండ‌గా..ఆయ‌న వియ్యంకుడు సి.హెచ్. ఆదినారాయణరెడ్డి టీడీపీ నుండి కడప ఎంపీగా పోటీలో ఉన్నారు.

English summary
Family members and relatives is in elections contest from different parties. All are waiting for results with out political rivalry. Many candidates from single family are seem to be interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X