వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియాపై లక్ష్మణ్ వ్యాఖ్య నాన్సెన్స్: రేణుకా, సిల్లీ: కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్‌గా నియమించడాన్ని తప్పు పడుతూ బిజెపి నేత డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. బిజెపి వ్యాఖ్యలు దురదృష్టకరమని వారన్నారు.

సానియా యూత్ ఐకాన్ అని, దేశానికి కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిందని కాంగ్రెసు నేత, పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఒకవైపు బేటీ బచావో, బేటీ బధావో అని పార్లమెంటులో అంటారని, మరోవైపు మాటలను నిలబెట్టుకోరని ఆమె అన్నారు.

ఓ పురుషుడు అంబాసిడర్ అయితే వారికి మంచిదని, ఓ మహిళ అయితే అటువంటి ప్రశ్నలు వేస్తారని ఆమె అన్నారు. సానియా తెలంగాణ అంబాసిడర్‌గా నియమితులు కావడం పట్ల తాను ఆనందంగా ఉన్నానని రేణుకా చౌదరి అన్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలను ఆమె నాన్సెన్స్ అన్నారు.

Political parties condemn BJP leader's remark on Sania Mirza

సానియాపై బిజెపి వ్యాఖ్యలు దురదృష్టకరమూ, అవాంఛనీయమని కాంగ్రెసు నాయకుడు మనీష్ తివారీ అన్నారు. విశాలమైన దృక్పథంతో వస్తే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశంలో మతపరమైన వేడిని పుట్టించి, నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల బిఎస్పీ చీఫ్ మాయావతి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం తగదని ఆమె అన్నారు. అది మతసామరస్యాన్ని దెబ్బ తీస్తుందని ఆమె అన్నారు.

లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించడం సిల్లీ అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బిజెపి నాయకులు అటువంటి ప్రటనలు చేసే ముందు సానియా మీర్జా రికార్డు చూడాలని, సానియా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని కవిత అన్నారు.

సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంలో తప్పేమిటని ఆమె అడిగారు. అమితాబ్ బచ్చన్ గుజరాత్‌కు చెందినవారు కారని, అయినా ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని, సానియా మీర్జా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడంలో తప్పేమిటని ఆమె అన్నారు.

రాజకీయ పార్టీల నిరసనను గుర్తించిన బిజెపి నాయకుడు ప్రకాష్ జవదేకర్ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ, సానియా మీర్జా భారతదేశానికి గర్వకారణమని అన్నారు. తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన అన్నారు. సానియా భారత బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. బిజెపి నేత మురళీ మనోహర్ జోషీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎవరైనా ఓ ప్రకటన చేస్తే, అది ఆ వ్యక్తి సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు.

English summary
Political parties on Thursday condemned a Telangana BJP leader for criticising the appointment of tennis star Sania Mirza as the state's brand ambassador, saying it was "unfortunate" and "bizarre."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X