వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెల్లి, తల్లి, ఆలిని తెచ్చింది మీరు కాదా?.. జగన్, సాయిరెడ్డిపై బుద్ధా ఫైర్.. విశాఖలో రాసలీలలంటూ..

|
Google Oneindia TeluguNews

''సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా?'' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన కామెంట్లపై రాజకీయ దుమారం మరింత ముదిరింది. రాజకీయాల్లోకి భార్యను ఎందుకు లాగుతున్నావంటూ లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా.. అవసరాల కోసో చెల్లి, తల్లి, ఆలిని వాడుకున్నది మీరుకాదా? అంటూ సీఎం జగన్, సాయిరెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైరయ్యారు.

లోకేశ్ 'పెళ్లాం’ కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి.. లోకేశ్ 'పెళ్లాం’ కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..


టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ముందుగా, అచ్చెన్నాయుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శించారు. కేసుల పాలైన ఇతర టీడీపీ నేతల ఇళ్లకు కూడా ఆయన వెళ్లారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నినంచడమే నేరమైపోయిందని, ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదంటూ విమర్శించారు. అంతటితో ఆగకుండా, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ప్రస్తావిస్తూ.. ‘‘ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాలంటే వైసీపీని అడగాలా? సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలన్నా జగన్ రెడ్డి అనుమతి తీసుకోవాలా?''అని ఫైరయ్యారు.

భార్యను లాగొద్దంటూ..

భార్యను లాగొద్దంటూ..

లోకేశ్ చేసిన ‘వైఫ్-వాట్సాప్' కామెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభ్యంతరంవ్యక్తం చేశారు. ‘‘ఏంటి లోకేశ్.. సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా? నువ్వేమైనా తీసుకుంటున్నావా? ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?'' అని ప్రశ్నించారు. బ్రాహ్మణి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ తమ నాయకుడి భార్యను ఈ వివాదంలోకి లాగడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..

Recommended Video

Happy Birthday Vijay: వీడు HERO ఏంటి అన్నారు..కానీ అతనే ఇప్పుడు SOUTH TOP HERO | Oneindia Telugu
ఫ్యామిలీని వాడుకుంది ఎవరు?

ఫ్యామిలీని వాడుకుంది ఎవరు?

బ్రాహ్మణి పేరును ప్రస్తావించకుండా విజయసాయి చేసినట్లే.. శర్మిల, విజయమ్మ, భారతిల పేర్లు వాడకుండా జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి-జగన్ లను మామా అల్లుళ్లుగా పేర్కొంటూ.. ‘‘చేత‌కాని, చేవ‌చ‌చ్చిన‌ నీ అల్లుడే కదా ఆ పని చేసింది.. జైలుకెళ్లిన‌ప్పుడు చెల్లిని, బెయిల్ కావాల్సిన‌ప్పుడు త‌ల్లిని, ప‌ద‌వి కోసం ఆలిని రాజ‌కీయాల్లోకి తెచ్చిన సంగతిని మ‌రిచిపోయావా శ‌కునిమామా'' అంటూ కౌంటర్ వేశారు.

విశాఖలో రాసలీలలు..

విశాఖలో రాసలీలలు..

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసే దాదాపు అన్ని పోస్టులు, వ్యాఖ్యలకు.. టీడీపీ తరఫున దీటుగా కౌంటర్లివ్వడం బుద్ధా వెంకన్న అలవాటు చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య నిత్యం డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చాలన్న ప్రతిపాదన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి.. విశాఖలో విజయాయి వ్యవహారాలపై టీడీపీ ప్రశ్నలు సంధిస్తూ వచ్చింది. కాగా, శుక్రవారం నాటి డైలాగ్ వార్ లో బుద్ధా అనూహ్య విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో.. నేరుగా నేత పేరును ప్రస్తావించకుండా... ‘‘విశాఖ‌లో ఎవ‌డో కంత్రీ ముస‌లోడు రాస‌లీల‌లతో ఆడ‌వారి జీవితాల‌తో ఆడుకుంటున్నాడ‌ట‌.. ఆ పోస్టుల్ని పెట్టేవాళ్ల‌ని మానేసి.. ముందుగా ఆ కంత్రీగాడిని ప‌ట్టుకోవ‌చ్చు క‌దా శ‌కుని మామా'' అని అర్థంకాని రీతిలో బుద్ధా వ్యాఖ్యలు చేశారు.

English summary
political row over erupts after tdp leader nara lokesh 'wife-whatsapp' comments on cm jagan. tdp mlc budda venkanna slams ysrcp mp vijayasai for dragging lokesh's wife name into the issue and accused jagans family
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X