వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ ..ఉండవల్లిలో చంద్రబాబు , పులివెందులలో జగన్ ,విజయవాడ పటమటలో పవన్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.

పోలింగ్ ..చింతమడకలో కేసీఆర్ , బంజారా హిల్స్ లో కేటీఆర్ , సోమాజీ గూడాలో నరసింహన్పోలింగ్ ..చింతమడకలో కేసీఆర్ , బంజారా హిల్స్ లో కేటీఆర్ , సోమాజీ గూడాలో నరసింహన్

ఉండవల్లిలో ఓటేసిన సీఎం చంద్రబాబు కుటుంబం

ఉండవల్లిలో ఓటేసిన సీఎం చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ ,బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి గురువారం నాడు ఓటేశారు .మంగళగిరి అసెంబ్లీ పరిధిలోనే ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషం . తనయుడు నారా లోకేష్ పోటీ చేసిన చోటే ఓటుహక్కు వినియోగించుకోవటం ప్రత్యేకంగా చెప్పవచ్చు . ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లే సమయంలో ఓ వృద్ధురాలితో బాబు మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకొన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబునాయుడు కోరారు. ఓటును వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని బాబు కోరారు.రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలైనందున ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజలను కోరారు.

 సతీమణి భారతితో కలిసి పులివెందులలో ఓటేసిన వైసీపీ అధినేత జగన్

సతీమణి భారతితో కలిసి పులివెందులలో ఓటేసిన వైసీపీ అధినేత జగన్

కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకొన్నారు.ఈ దఫా ప్రజలు రాష్ట్రంలో మార్పును కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలు ఈ దఫా మార్పును కోరుకొంటున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.ఓటు హక్కును వినియోగించుకొనే సమయంలో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సిస్టమ్ మార్పు కావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దఫా ప్రజలు స్పష్టమైన తీర్పును ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.దేవుడు అనుకొన్నట్టుగానే ఈ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు.నిజాయితీ, విశ్వసనీయత, యంగ్ డైనమిక్ నాయకత్వం కోసం ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారు.

 విజయవాడ పటమటలో ఓటుహక్కు వినియోగించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్

విజయవాడ పటమటలో ఓటుహక్కు వినియోగించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్


ఉదయం 7.30-8.00 గంటల సమయంలో విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూత్ లో పవన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరారు.

English summary
Lok sabha and assembly polls started in Andhrapradesh state. Andhrapradesh CM Chandrababu couple along with his son and daughter in law utilize their votes at Undavalli which has been in the Mangalagiri constituency .The interesting point is Nara Lokesh contesting in the Mangalagiri constituency. YCP chief Jagan mohan reddy along with her wife Bharathi reddy cast their votes in Pulivendula constituency.Janasena chief Pavan kalyan cast his vote at Vijayawada Patamata .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X