వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ దమ్ముంటే చర్చకు రా: పొన్నాల, జానా ఫైర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తల కోసుకుంటానని చెప్పినా తల తెగిపడదలేదని, ఇచ్చిన హామీలను నెరవేరలేదని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పటాన్ చెరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటమార్చారని అన్నారు.

పార్టీలు మారి తెలంగాణ ఉద్యమ మసుగులో కేసీఆర్ సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వబట్టే తమ పదేళ్లకాలంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన అన్నారు.

ఈ వందరోజల ఫ్రభుత్వ పాలనలో ఆ పరిస్దితి ఎక్కుడా కనిపించలేదని విమర్శించారు. దేని గురించి చర్చిచండానికైనా కాంగ్రెస్ సిద్దంగా ఉందని, దమ్ముంటే తమతో చర్చకు రావాలని కేసీఆర్‌‌కు సవాల్ విసిరారు. ప్రజలు మెదక్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.

 Ponnala Lakshmaiah challanges on Telangana CM KCR

కేసీఆర్‌కు అసలు విద్యుత్‌పై అవగాహన ఉందా, మూడేళ్లలో 15వేల మోగావాట్ల విద్యుత్ ఇస్తానని చెప్పడం నమ్మదగిన మాటలేనా అని ఎద్దేవా చేశారు. ఇదే కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆచరణ సాధ్యంకాని వాస్తవాలను తెరాస చేసిందని, వందరోజుల్లో అందుబాటులోని ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయిందని దుయ్యబట్టారు.

ఈ ఉపఎన్నికలు తెరాస ప్రభుత్వానికి హెచ్చరికగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఓ పక్క రెండున్నర నెలల్లో ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ తెప్పిస్తానని చెబుతూ, మరోవైపు మూడు సంవత్సరాలైన ప్రస్తుత కరెంటు కష్టాలు తీరవని చెబుతున్నారని అన్నారు.

English summary
Ponnala Lakshmaiah challanges on Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X