వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభపై పొన్నాల: జగన్‌తో సిపిఎం ఒప్పందం... నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala laxmaiah and Narayana
వరంగల్/ఒంగోలు: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సమైక్యాంధ్ర కోసమంటూ సభలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లోను ఆగదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అలాంటి వాటి పైన స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే నాడు జై ఆంధ్ర ఉద్యమం చేసిన వారు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. సమైక్య సభ పెడితే తెలుగు వారిని అపఖ్యాతి పాలు చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్‌తో రహస్య ఒప్పందంపై నారాయణ సవాల్

సిపిఎంకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో రహస్య ఒప్పందం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గురువారం ప్రకాశం జిల్లాలో మండిపడ్డారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుకు దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో గల రహస్య ఒప్పందం బయటపెట్టాలని సవాల్ చేశారు.

వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీతో రహస్య సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని సిపిఎం బహిర్గతం చేయాలన్నారు. అవసరమైతే సిపిఐ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్‌లు ఆధిపత్యం కోసమే దీక్షలు చేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం విజయవంతమైందన్నారు.

English summary
IT Minister Ponnala Laxmaiah on Thursday denied to respond on CM Kiran Kumar Reddy's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X