వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ వీడియోల లింకుల ఎఫెక్ట్: ఐదుగురు ఎస్వీబీసీ ఉద్యోగులను తొలగించిన టీటీడీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని ఎస్వీబీసీలో పోర్న్ వీడియోల లింకులు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరిపిన టీటీడీ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. బాధ్యులను విధుల నుంచి తొలగించింది.

విజిలెన్స్ విభాగంతో విచారణ ప్రారంభించిన టీటీడీ.. కారకులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ బృందాన్ని కూడా రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ కార్యాలయానికి చెందిన ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది. మరో నలుగురికి నోటీసులు పంపింది. కాగా, పోర్న్ లింకును పంపిన ఉద్యోగిని ఇప్పటికే తొలగించినట్లు సమాచారం.

porn videos links effect in SVBC: five employees dismissed

ఈ ఐదుగురు కూడా ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే సమయంలో పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు సైబర్ క్రైమ్ బృందం గుర్తించింది. టీటీడీ తొలగించిన వారిలో వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. ఇక షోకాజు నోటీసులు అందుకున్నవారిలో చానెల్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లు తెలిపారు.

అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ఓ భక్తుడు 'శతమానం భవతి' కార్యక్రమానికి సంబంధించి ఈ మెయిల్ పంపాడు. అయితే, ఆ భక్తుడికి ఆధ్యాత్మిక అంశాల లింకులు పంపాల్సింది పోయి.. పోర్న్ లింకులు పంపారు నిందితులు. దీంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

English summary
porn videos links effect in SVBC: five employees dismissed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X