• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌కు వెన్నుపోటు? ఎన్టీఆర్ కాడుగా.. తాగి పడుకుంటే పనులెలా? ఒక్క పీసీ పోసాని భారీ బాంబులు..

|

''ఈ మధ్య టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ తీరు అసలేం బాగోలేదని, ముఖ్యమంత్రిగా జగన్ ఐదేళ్లు అవసరమా? అని, త్వరలోనే ఎన్నికలొచ్చి, టీడీపీ ప్రభంజనంతో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని అన్నారు. బాలయ్యా.. చంద్రబాబుతో వెన్నుపోటు పొడిపించుకోడానికి అక్కడుంది ఎన్టీఆర్ కాదు.. జగన్ మోహన్ రెడ్డి అని గుర్తుంచుకోండి.. జగన్ తాను ఎవరినీ పొడవడు.. పొడిపించుకోడు.. ఇంకా నాలుగేళ్లు ఆయనే సీఎంగా ఉంటారు''అని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అన్నారు.

భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..

తిట్టడానికి కాదంటూనే..

తిట్టడానికి కాదంటూనే..

కరోనా విలయం కొనసాగుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మళ్లీ యాక్టివ్ అయిన నేపథ్యంలో ఆయా ప్రతిపక్ష పార్టీలు.. ముఖ్యమంత్రులపై విమర్శలు చేస్తున్న తీరును పోసాని తప్పుపట్టారు. ఆదివారం సడెన్ గా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. ఒకర్ని తిట్టడానికో, మరొకర్ని పొగడటానికో మీడియా ముందుకు రాలేదంటూనే సినీ, పొలిటికల్ రంగాలపై భారీ బాంబులు విసిరారు.

డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి అజ్ఞాతంలోకి.. కూపీ లాగుతోన్న సీబీఐ..

బాలయ్యను సీరియస్‌గా తీసుకోవద్దు..

బాలయ్యను సీరియస్‌గా తీసుకోవద్దు..

జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ పడగొడుతుందనో, భూముల దందా గురించే సినీ పెద్దలు కేసీఆర్‌ను కలిశారనో బాలకృష్ణ చేసిన కామెంట్లను ఎవరుకూడా సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని పోసాని కృష్ణ మురళి అన్నారు. బాలయ్య కోపంగా మాట్లాడినా, తిట్టినా మరునిమిషంలోనే మామూలు మనిషి అయిపోతారని, నిజానికి బాలయ్య హానెస్ట్ ఫెలో అని, ఆయన రాజకీయాల్లోకి వచ్చింది సంపాదన కోసం కాదని, బాలయ్య కోపంతో సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదని పోసారి సర్టిఫికేట్ ఇచ్చారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ సీఎం కావడానికి ఆయన నిజాయితీకితోడు మీడియా సహకారం కూడా ఉందని గుర్తుచేశారు.

కేసీఆర్ తాగి పడుకుంటే..

కేసీఆర్ తాగి పడుకుంటే..

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోన్న కాంగ్రెస్.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న తీరు అస్సలు బాగోలేదని, ప్రధానంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల చేస్తున్న విమర్శలు ఎబ్బెట్టుగా ఉన్నాయని పోసాని దుయ్యబట్టారు. ‘‘కేసీఆర్ తాగి పడుకుంటాడని, ప్రతిరోజూ ఆయనను ఉత్సవవిగ్రహాన్ని మోసుకొచ్చినట్లు సిబ్బంది తీసుకొస్తారని రేవంత్ అంటున్నాడు. కేసీఆర్ తాగుతాడా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. ప్రజల కోసం పనిచేస్తున్నాడా, లేదా అనేదే ముఖ్యం. అయినా, తాగి పడుకునే నాగార్జున సాగర్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టగలిగేవాడేనా?''అని పోసాని ప్రశ్నించారు.

ఇదెక్కడి లాజిక్?

ఇదెక్కడి లాజిక్?

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో మంత్రి కేటీఆర్ భారీ ఫాంహౌజ్ ను అక్రమంగా జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. అయితే, దర్యాప్తు సజావుగా సాగాలంటే కేటీఆర్ పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడంపై పోసాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశిస్తే.. కాంగ్రెస్.. కేటీఆర్ రాజీనామా కోరడమేంటి? ఇదెక్కడి లాజికో నాకు అర్థంకాలేదు. గతంలో రూ.50 లక్షలు లంచమిస్తూ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి వ్యక్తి కేటీఆర్ లాంటి మంచిమనిషిపై బురదజల్లడమేంటి?''అని మండిపడ్డారు.

వాళ్లిద్దరూ రెండు కళ్లు..

వాళ్లిద్దరూ రెండు కళ్లు..

మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చాలా నిజాయితీపరులని, భవిష్యత్తులో తెలంగాణకు ఆ ఇద్దరూ రెండు కళ్లలాంటి వాళ్లని పోసాని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్లే కేటీఆర్ ఉంటారని, ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసని, ఒకవేళ కాంగ్రెస్ నేతలు గనుక కేటీఆర్ అవినీతిని నిరూపించిన పక్షంలో.. స్వయంగా తానే తెలంగాణ అంతటా తిరిగి టీఆర్ఎస్ కు వ్యతిరేక ప్రచారం చేస్తానని కృష్ణ మురళి అన్నారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులో కమిషన్ల తిన్నారంటూ కేసీఆర్‌ను ఉత్తమ్, జానారెడ్డిలాంటి వాళ్లు విమర్శించడం తగదని, ఏదైనా మాట్లాడేముందుకు కాంగ్రెస్ నేతలు అద్దంలో ముఖాలు చూసుకుని రావాలని పోసాని చురకవేశారు.

  National Green Tribunal gives Stay On Pothireddypadu Head Regulator works
  జగన్ వింటాడు.. కేసీర్ ఆలోచిస్తాడు..

  జగన్ వింటాడు.. కేసీర్ ఆలోచిస్తాడు..

  పోతిరెడ్డిపాడు అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల జల జగడం చోటుచేసుకోవడం, పోటాపోటీగా కేంద్రానికి ఫిర్యాదులు చేసుకోవడాన్ని పోసాని తనదైన శైలిలో వివరించారు. ‘‘ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది. కేసీఆర్ ఏదైనా చెబితే జగన్ వింటాడు. అలాగే జగన్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తాడు. వీళ్లిద్దరూ కూర్చొని పోతిరెడ్డుపాడు వివాదాన్ని పరిష్కరించుకుంటారని భావిస్తున్నా. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలతో ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి ''అని కృష్ణ మురళి అన్నారు.

  English summary
  while speaking with media on sunday, tollywood actor, writer posani krishna murali made sensational comments on andhra pradesh and telangana politics.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more