వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదీ మరిచాడు, పవన్‌కు ఓటెందుకు వేయాలి, ఓటుకు నోటులో కేసీఆర్ కాళ్లు పట్టుకున్న బాబు: పోసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి సోమవారం నిప్పులు చెరిగారు. ఒక మగ వగలాడి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టానని ప్రారంభించారు. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసునంటూ చంద్రబాబు పేరును ప్రస్తావించారు. చంద్రబాబు ఏ పొజిషన్లో ఓడిపోయి టీడీపీలోకి వచ్చారో ఏ పొజిషన్లో ఆయన్ని ఎన్టీఆర్ ఆదరించారో, ఏ పొజిషన్లో ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారో, ఆయన పార్టీ లాక్కుని, జెండా లాక్కుని, ఆయన జీవితాన్ని లాక్కుని, ఆయనపై చెప్పులేసి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబుకు సంబంధించిన ఫోటోలు అంటూ పలు ఫోటోలను చూపించారు.

చదవండి: కేసీఆర్ దయ లేకుంటే చంద్రబాబు జైల్లో ఉండేవాడు: పోసాని, పవన్‌పై..

జగన్ అనే వ్యక్తి 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యేలను తన వైపు సిగ్గులేకుండా ఎలా తిప్పుకున్నారో ఈ ఫొటోలు చూడండి అన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటంతో సొంత పార్టీని నిర్లక్ష్యం చేశారన్నారు. నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకులో రాధాకృష్ణ అన్న స్వయంగా రాశారని, ఎలాంటి ఆరాటం చంద్రబాబుకు ఉందో, అది ఎలాంటి ఆరాటమంటే సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొచ్చి టీడీపీ కండువాలు కప్పి, వాళ్లకు డబ్బులిచ్చి తన వైపు లాక్కోవడం ఏపీ అభివృద్ధిలో భాగమా? అన్నారు. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనేసి.. అక్కడి నుంచి పారిపోయి.. కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీశ్ రావు కాళ్లు పట్టుకుని విజయవాడ పారిపోయిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలన్న ఆరాటంలో సొంత బిడ్డలను కూడా మర్చిపోయారట అని మండిపడ్డారు.

చదవండి: బాబు ఎవరినైనా చంపేస్తారు! నార్కో టెస్ట్ చేయాలి, నా ఓటు జగన్‌కే కానీ: ఊగిపోయిన పోసాని

పవన్ కళ్యాణ్ ఆ ద్రోహం కూడా మరిచిపోయాడు

పవన్ కళ్యాణ్ ఆ ద్రోహం కూడా మరిచిపోయాడు

2014లో నీవు గెలిచేందుకు అదే కాపు యువకుడు పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చాడా అని పోసాని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ఇంటికి వెళ్లావని, ఆయనను వాటేసుకున్నావని ఎద్దేవా చేశారు. పాపం పవన్.. అమాయకుడు అన్నారు. తన సోదరుడు చిరంజీవికి ఎంత ద్రోహం చేశారో కూడా మరిచిపోయాడన్నారు.

పవన్ వ్యక్తిగతంగా దుర్మార్గుడు, దుష్టుడు అయ్యాడు

పవన్ వ్యక్తిగతంగా దుర్మార్గుడు, దుష్టుడు అయ్యాడు

2014లో చంద్రబాబు సీనియర్ అని పవన్ మద్దతిచ్చారని, కానీ మంచి పని చేసేందుకు సీనియార్టీ ఎందుకు అనే విషయం పవన్ తెలుసుకోలేక టీడీపీకి మద్దతిచ్చారని పోసాని చెప్పారు. కానీ ఇదే చంద్రబాబు చివరకు ఆ పవన్ కళ్యాణ్‌ను కూడా బతకనీయలేదన్నారు. మద్దతిచ్చినంత కాలం కలిసి పవన్‌ను బాగా చూసుకున్నాడని, కానీ ఈ ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయని పవన్ చెప్పగానే అతని (పవన్) గురించి, అతని వ్యక్తిగతంగా, దుర్మార్గం, దుష్టుడు అయిపోయాడని విమర్శించారు.

మెస్మరైజ్ చేసి నన్ను కూడా వాడుకుంటాడు

మెస్మరైజ్ చేసి నన్ను కూడా వాడుకుంటాడు

ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించడంతో టీడీపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్‌టచబుల్ అయిపోయాడని పోసాని చెప్పారు. అందుకే నేను చెప్పదల్చుకుందేమంటే చంద్రబాబు ఎవరినైనా వాడుకోగలడన్నారు. నాలుగు రోజులు ఆగి నా అవసరం పడితే, నన్ను మెస్మరైజ్ చేసి నన్ను కూడా వాటేసుకుంటాడని ఎద్దేవా చేశారు. ఈ మధ్య కులపిచ్చి ఎక్కువయిందని, అందుకే ఏ కులం వాళ్లు ఆ కులం వారికి ఓటేస్తారన్నారు.

మన కూతురు జీవితం.. రాజకీయం

మన కూతురు జీవితం.. రాజకీయం

ఇప్పుడు నేను కూడా కమ్మ కులం వాడినేనని, తనకు ఓ కూతురు ఉందని, కమ్మ యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని, కానీ మంచివాడు, తాగుబోతు కానివాడు, తిరుగుబోతు కావొద్దని, డబ్బు ఉన్న వాడు అయి ఉండాలని, అందంగా ఉండాలని, మంచి ఉద్యోగస్తుడు కావాలని, సిగరేట్ తాగవద్దని.. ఇలా కోరుకుంటానని పోసాని అన్నారు. కానీ వాడు కమ్మవాడైతే చాలు ఎలాంటి వాడికైనా ఇస్తే కూతురు జీవితం నాశనం కాదా అని ప్రశ్నించారు. అందుకే రాజకీయాల్లోను ఇలాగే గుణం కావాలన్నారు. ఇది చంద్రబాబుకు ఉందో లేదో తెలుసుకోవాలన్నారు.

త్వరలో ఎన్నికలు

త్వరలో ఎన్నికలు

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని పోసాని అన్నారు. కాబట్టి ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును విలువలు లేని వ్యక్తి అని చంద్రబాబు ఎప్పుడైతే అన్నారో అప్పుడే నైతికంగా చచ్చిపోయాడన్నారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదా అని ఓ విలేకరి ప్రశ్నించగా పోసాని స్పందించారు. ఏ విషయంలో నమ్మకం లేదనుకుంటున్నారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉంటే తిరుగుతానని, కానీ ఇప్పుడు ప్రజారాజ్యం లేదన్నారు. వారు పార్టీలు మార్చుకుంటే నేను పార్టీలు మారాలా అన్నారు. వారు పార్టీల పేర్లు మార్చుకుంటూ వెళ్తున్నారని, నేను కూడా పోసాని కృష్ణమురళీ, మురళీకృష్ణ, సుబ్బయ్య అని నేను మార్చుకోవాలా అన్నారు.

నా కొడుక్కే ఓటేయని, పవన్ కళ్యాణ్‌కు ఎందుకు వేస్తా?

నా కొడుక్కే ఓటేయని, పవన్ కళ్యాణ్‌కు ఎందుకు వేస్తా?

పవన్‌కు ఎందుకు ఓటేయరని విలేకరులు అడగగా పోసాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. నా కొడుకు ఉజ్వల్ అందంగా ఉంటాడని, నా కంటే తెలివిగలవాడని, 24 ఏళ్ల యువకుడు అని, అంతర్జాతీయంగా తన కొడుకుకు ఎంతో రాజకీయ జ్ఞానం ఉందని, అలాంటి వాడు రేపు పొద్దున వచ్చి నాన్నా నేను పార్టీ పెడుతున్నాను, నాకు మద్దతివ్వమని అడిగితే నేను పొరపాటున కూడా చేయనన్నారు. యెధవా.. నీకు 24 ఏళ్లు ఏం తెలివి ఉందిరా అంటానని, నా కొడుక్కే నేను ఓటేయనని, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఎందుకు వేస్తానని పోసాని అన్నారు. పవన్‌కు ఓటు ఎందుకు వేయాలన్నారు. నా కొడుక్కు కూడా ఎందుకు వేయాలన్నారు. పవన్ మంచివాడని, హానెస్ట్ పర్సన్ అని, తెలివిగలవాడన్నారు. నాకు స్పష్టమైన విజన్ ఉందన్నారు. అది మంచియా, చెడా అనవసరమని, నా విజన్‌లో తప్పుంటే చెప్పాలన్నారు. జగన్ అవినీతిపరుడు కదా అందుకు ఓటు వేయవద్దంటే, కోర్టులో అతనికి 20 ఏళ్లు శిక్ష పడితే నేను జగన్ పేరెత్తనని, మరు చెప్పిన వారికి ఓటు వేస్తానని అన్నారు. నా మీద కేసులు ఉంటే నేను స్టే తెచ్చుకోనన్నారు.

English summary
Posani Krishna Murali hot comments on Chandrababu and he says will not vote Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X