వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుకూల‌మా..? ప‌్ర‌తికూల‌మా..? అభిమానం ఓట్లు కురిపిస్తేనే గ‌బ్బ‌ర్ సింగ్ విజ‌యం..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్క్రీన్ స్టామినా పొలిటిక‌ల్ స్క్రీన్ మీద క‌న‌ప‌డుతుందా..? అంటే ఏమో అనే ప‌రిస్థితలు నెల‌కొన్నాయి. ఆంధ్ర‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే. జ‌న‌సేన ఎన్ని సీట్లు గెలుస్తుంద‌న్న ప్ర‌శ్న ప‌క్క‌న‌ప‌డితే, స్వ‌తహాగా పోటీ చేసే స్థానాల్లో కాట‌మ‌రాయుడు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విశాఖ జిల్లా గాజువాక, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి పోటీలో ఉన్నారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేసే పరిస్థితి లేక‌పోవ‌డంతో గ‌బ్బ‌ర్ సింగ్ గ‌ట్టి పోటీ ఎదుర్కొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

రెండు చోట్ల ప‌వ‌న్ పోటీ..! కానీ ప్ర‌చారానికి వెళ్లే టైమ్ మాత్రం లేదు..!!

రెండు చోట్ల ప‌వ‌న్ పోటీ..! కానీ ప్ర‌చారానికి వెళ్లే టైమ్ మాత్రం లేదు..!!

గాజువాక‌, భీమ‌వ‌రం నియోజక వ‌ర్గాల్లో ఒక స్థానంలో గెలుపు అంత ఈజీ కాద‌ని తేలిపోయింది. పాతిక కిలోల బియ్యం కోసం కాదు పాతికేళ్ల భ‌రోసా కోసం అంటూ ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌సంగం మాత్రం వినిపించారు. ఈ రెండు స్థానాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌చారా��ికి వెళ్ల‌లేదు. కేవ‌లం నామినేష‌న్ వేసే స‌మ‌యంలోనే అక్క‌డికి వెళ్లి ర్యాలీ తీసి వ‌చ్చేశారు. జ‌న‌సేన అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌టిస్తుండ‌టంతో ప‌వ‌న్ పోటీ చేసే స్థానాల్లో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేసే నాథుడు లేకుండాపోయాడు. జ‌న‌సేన‌కు సంస్థాగ‌త నిర్మాణం లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా మారింద‌ని, ఆ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో క‌నిపించ‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబ��తున్నారు.

రెండు చోట్లా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు..! ప‌వ‌న్ ను సొంత సామాజిక వ‌ర్గం క‌రుణిస్తుందా..?

రెండు చోట్లా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు..! ప‌వ‌న్ ను సొంత సామాజిక వ‌ర్గం క‌రుణిస్తుందా..?

అంతే కాకుండా ప‌వ‌న్ ఎంచుకున్న రెండు స్థానాలు కూడా తెదేపాకు కంచుకోట‌లుగా ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను ఢీ కొని విజ‌యం సాధించాలి. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యేల‌ను ఆయ‌న ఛ‌రిష్మాతో అడ్డుకోగ‌ల‌రా.. అన్న‌ద��� అనుమానంగా మారింది. అయితే.. ప‌వ‌న్ ఒక‌టి లేదా రెండు సార్లు ప్ర‌చారం చేస్తే చాల‌ని, ప్ర‌జ‌లంతా ఆయ‌న‌వైపే మొగ్గుచూపుతున‌న్నార‌న్న ప్ర‌చారం ఉంది. భీమ‌వ‌రంలో ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు త‌క్కువ‌గా ఉండ‌టం.. అదీగాక వారంతా ప‌వ‌న్‌వైపే మొగ్గుచూపుతారా.. అన్న‌ది ప్ర‌శ్నగా మారింది. భీమ‌వ‌రంలో ప‌రిస్థితి చూస్తే 70 వేల మంది కాపు సామాజిక ఓట‌ర్లు ఉంటార‌ని అంచ‌నా. చిరంజీవి, ప‌వ‌న్ అభిమానులు పెద్ద‌సంఖ్య‌లో ఉన్నారు. అదీగాక ఆయ‌న స్వ‌గ్రామం పక్క‌నే ఉన్న న‌ర‌సాపురంలో ఉంది. ఈ ప్ర‌భావంతో ఆయ‌న ఇక్క‌డ పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపారు.

గుజువాక ఫ‌ల‌వాలేదు..! భీమ‌వ‌రంలో ఎదురీదే ప‌రిస్థితులు..!!

గుజువాక ఫ‌ల‌వాలేదు..! భీమ‌వ‌రంలో ఎదురీదే ప‌రిస్థితులు..!!

అయితే.. భీమ‌వ‌రంలో కాపు సామాజిక వ‌ర్గం కంటే అగ్నికుల క్ష‌త్రియులే ఎక్కువ‌. వారు ఎటువైపు మొగ్గుచూపితే వారికే విజ‌యావ‌కాశాలు ద‌��్కుతాయి. కొన్నేళ్లుగా వీరంతా టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారు. వీరి వ‌ర్గానికి చెందిన నాయ‌క‌ర్‌కు ప‌క్క‌నే ఉన్న న‌ర‌సాపురంలో టికెట్ ఇవ్వ‌డం జ‌న‌సేన‌కు క‌లిసి వ‌చ్చే అంశం అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్రవ్యాప్తంగా త‌మ కుల‌స్థుల‌కు ఒకే సీటు ఇచ్చార‌న్న విమ‌ర్శ కూడా ఉంది. అందుకే ఈ రెండు అంశాలు కూడా జ‌న‌సేనాని విజ‌యంపై ప్ర‌భావం చూపనున్నాయి. భీమ‌వ‌రంలో తెదేపా నుంచి పుల‌వ‌ర్తి రామాంజ‌నేయులు, వైసీపీ నుంచి గ్రంధి శ్రీ‌నివాస్ పోటీ చేస్తున్నారు.వీరు ఇంటింటి ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ప‌వ‌న్ త‌ర‌ఫున ప్ర‌చారం చేసే నాయ‌కులు మాత్రం కినిపించ‌డం లేదు.

అభిమానం ఓట్లు కురిపిస్తే ఓకే..! లేక‌పోతే గ‌బ్బ‌ర్ సింగ్ కు గ‌డ్డు కాల‌మే..!!

అభిమానం ఓట్లు కురిపిస్తే ఓకే..! లేక‌పోతే గ‌బ్బ‌ర్ సింగ్ కు గ‌డ్డు కాల‌మే..!!

గాజువాకలోనూ ఇద్ద‌రు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌ను ప‌వ‌న్ ఢీకొంటున్నారు. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ గెలిచింద‌న్న ఉద్దేశంతో ప‌వ‌న్ ఇక్క‌డి నుంచి బ‌రిలో దిగేందుకు సుముఖ‌త చూపారు. ఇక్క‌డ ప‌వ‌న్ సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు కూడా 55 వేల మంది వ‌ర‌కు ఉన్నారు. జ‌న‌సేన స‌భ్య‌త్వం కూడా 58 వేల మంది తీసుకున్నారు. అదీగాక ఉద్యోగులు పెద్ద‌సంఖ్య‌లో ఉన్నారు. విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయ‌ణ బ‌రిలో ఉండ‌టంతో త‌న‌కు, ల‌క్ష్మీనారాయ‌ణ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. కానీ ఇక్క‌డ తె���ేపా సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, వైసీపీ అభ్య‌ర్థి తిప్ప‌ల నాగిరెడ్డి బ‌లంగా ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరాహ‌రీగా ఉండేది. ఇప్పుడు ప‌వ‌న్ ఎంట్రీతో ఇది ముక్కోణ‌పు పోరుగా మారింది. ఇక్క‌డ పవ‌న్‌కు కొంత సానుకూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసే వారే లేరు. ఆయ‌న పార్టీ గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

English summary
This is also the debate on Janasena chief Pawan Kalyan in Andhra. If there is a question of how many seats will win in Janasena, Katamarayudu seems to be in a difficult position in the self-contested seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X