• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్యార్థుల తల్లిదండ్రుల ఫోరాట ఫలితమే ఇంటర్ పరీక్షల వాయిదా.!స్పష్టం చేసిన నారా లోకేష్.!

|

అమరావతి/హైదరాబాద్: ఇంటర్ పరీక్షల వాయిదా విద్యార్థులు, తల్లిదండ్రుల విజయమని, సమిష్టి పోరాటం ద్వారానే ఈ విజయం సాదించామని పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పేర్కొన్నారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించడాన్ని నారా లోకేష్ స్వాగతించారు. ఈ విజయం విద్యార్థులు, తల్లిదండ్రులదని, గత 20 రోజులుగా పరీక్షల వాయిదాపై పోరాటం చేస్తున్నామని, పరీక్షలు వాయిదాకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు తనకు విజ్ఞప్తి చేసారని నారా లోకేష్ తెలిపారు.

 ఇంటర్ పరీక్షల వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలన్న లోకేష్..

ఇంటర్ పరీక్షల వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలన్న లోకేష్..

విద్యార్థుల భవితకోసం ఏప్రిల్ 18న ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని లోకేష్ తెలిపారు. లేఖలో పది, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు లోకేష్. 22వ తేదీన టౌన్ హాల్ ఏర్పాటుచేసి విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చమని, అయినా స్పందన లేదని తెలిపారు. 24 వ తేదీన మీడియా మిత్రులతో సమావేశం అయి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి నిర్ణయించామని లోకేష్ గుర్తు చేసారు.

 విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం భేష్.. అందుకే ప్రభుత్వం దిగొచ్చిందన్న లోకేష్..

విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం భేష్.. అందుకే ప్రభుత్వం దిగొచ్చిందన్న లోకేష్..

26వ తేదీన టౌన్ హాల్ లో సమావేశం నిర్వహించి న్యాయపోరాటానికి నిర్ణయించడం జరిగిందని లోకేష్ తెలిపారు. 28న విద్యార్ధుల, తల్లిదండ్రుల హక్కుల కోసం న్యాయపోరాటం ప్రారంభించామని, కోర్టు కూడా పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని చెప్పడం జరిగిందని తెలిపారు. దేశంలో గడచిన 24 గంటల్లో 4 లక్షల కరోనా కేసులు వచ్చాయని, ఏపీలో 20వేల కేసులు నమోదయ్యాయని లోకేష్ విచారాన్ని వ్యక్తం చేసారు. శనివారం ఒక్కరోజే 26 మంది ఆక్సీజన్ లేక కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చనిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావించామని అన్నారు.

 పరీక్షలు జరిగిఉంటే ప్రమాదం జరిగేది.. విద్యార్థులు కరోనా బారిన పడే వారన్న లోకేష్..

పరీక్షలు జరిగిఉంటే ప్రమాదం జరిగేది.. విద్యార్థులు కరోనా బారిన పడే వారన్న లోకేష్..

ప్రస్తుతానికి 16శాతం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రేటు ఉందని, 15 లక్షల మంది పరీక్షలు రాస్తే 2 లక్షల మందికి కరోనా వచ్చే అవకాశం ఉందని, వీళ్ల ద్వారా తల్లిదండ్రులు, వృద్ధులు కలిపి మొత్తం 10 లక్షల మంది కరోనా వచ్చే అవకాశం ఉందని లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, మేధావులతో మాట్లాడి అవసరమైతే పరీక్షలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందరం కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా ఈ విజయం సాధించగలిగామని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలని, సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను తెలియజేసినందుకు కృతజ్ఞతలని లోకేష్ తెలిపారు.

 పదవ తరగతి పరీక్షల గురించి కూడా ఆలోచించాలి.. ప్రభుత్వానికి లోకేష్ మరోసారి విజ్ఞప్తి..

పదవ తరగతి పరీక్షల గురించి కూడా ఆలోచించాలి.. ప్రభుత్వానికి లోకేష్ మరోసారి విజ్ఞప్తి..

ఉద్యమంలో భాగస్వాములైన జనసేన, కమ్యూనిస్ట్ లకు, విద్యార్థి సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు లోకేష్. పరీక్షలు వాయిదా వేశారని విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండొద్దని, మరింతగా ప్రిపేర్ కావాలని సూచించారు. కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, మన వల్ల కరోనా విస్తరించకూడదని అభిప్రాయపడ్డారు. టౌన్ హాల్స్ కార్యక్రమాన్ని ముందు ముందు కొనసాగిస్తామని, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నరు. విద్యార్థుల సమస్యలపై పోరాటానికి తాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు.

English summary
MLC Nara Lokesh said that the postponement of the inter-examinations was a victory for the students and parents and thanked everyone who contributed to the struggle that this victory was achieved through collective struggle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X