• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అడకత్తెరలో జగన్..10 రోజులు గడిచేదెలా?.. శ్రీశైలంలో ‘విద్యుత్’నిలిపివేత.. వాటా తోడేసుకుంటోన్న తెలంగాణ

|

అసలే దంచికొడుతోన్న ఎండలు.. సీమ జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి.. బావుల్లో అడుగంటిన నీళ్లనైనా తోడుకుందామంటే కరెంటు సమస్యలు.. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా విద్యుత్ ఉత్పతి నిలిపివేత. ''ఈ నీటి సంవత్సరానికిగానూ మీ వాటా పూర్తయింది. ఇక వినియోగం ఆపేయండి..''అంటూ ఆంధ్రప్రదేశ్‌ను కృష్ణా బోర్డు ఆదేశించిన నేపథ్యంలో జగన్ సర్కారు గురువారం నుంచి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనను పూర్తిగా నిలిపివేసింది.

సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..

ఈ 10 రోజులు ఎలా?

ఈ 10 రోజులు ఎలా?

కృష్ణా నదిలో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నికర జలాల కోటా ఉంది. ఈ ఏడాది వరదల కారణంగా 920 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీకి 647 టీఎంసీలు, తెలంగాణకు 333 టీఎంసీలు పంచారు. అయితే ఆంధ్ర తన వాటా నీటిని ఇప్పటికే వాడేసింది. కృష్ణా డెల్టా కోసం 152 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు ద్వారా 169 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా 195 టీఎంసీలు,తుంగభద్ర పరిధిలో 50 టీఎంసీలు, హంద్రీ-నీవా ద్వారా 41 టీఎంసీలు వాడేయడంతో కోటా పూర్తయిందన్న కృష్ణాబోర్డు.. ఇకపై నీటిని వాడుకోరాదంటూ మంగళవారం ఆదేశాలు జరీచేశారు. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుండగా, ఈ 10 రోజులు జల, విద్యుత్ గండాన్ని జగన్ ఎలా దాటుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీ సర్కారు వివరణ..

ఏపీ సర్కారు వివరణ..

పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ గట్టు కేంద్రం వద్ద తెలంగాణ, కుడిగట్టు కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా రెండు రాష్ట్రాలు కూడా పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేయగా.. పోతిరెడ్డిపాడు అంశం తెరపైకి వచ్చిన తర్వాత సీన్ మారింది. జగన్ సర్కారు జీవో 203పై తెలంగాణ చేసిన ఫిర్యాదు మేరకు కృష్ణాబోర్డు స్పందించి.. ఏపీ వాటా పూర్తయిపోయిందని స్పష్టం చేసింది. గురువారం నుంచి ఏపీ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసినట్లు కుడిగట్టు కేంద్రం ఇన్ చార్జి చీఫ్ ఇంజనీర్ రాంబాబు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 812 అడుగులకు చేరిందని, రిజర్వాయర్‌లో 32.8 టీఎంసీలకు పడిపోయిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పవర్ ప్రొడక్షన్ నిలిపేశామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా రివర్ బోర్డు ఏపీకి కేటాయించిన నీటి వాటాల ప్రకారం జలాశయంలోని నీటిని వినియోగించుకున్నట్లు రాంబాబు వివరించారు.

తగ్గని తెలంగాణ..

తగ్గని తెలంగాణ..

కృష్ణా నదీ జలాల వినియోగంలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయని, రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వాడుకున్నాయని, ఏపీ తన వాటాను(647 టీఎంసీలు) మించి 647.559 టీఎంసీలు వాడుకోగా, తెలంగాణ మాత్రం 272.846 టీఎంసీలనే వాడుకుందని కృష్ణాబోర్డు పేర్కొంది. ఇంకా 60.605 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండటంతో కేసీఆర్ సర్కారు శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. గురువారం 21.7 మిలియన్ యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేసినట్లు టీఎస్ జెన్కో అధికారులు పేర్కొన్నారు.

సీమకు నీళ్లెలా?

సీమకు నీళ్లెలా?

ఈసారి వరదలు సంవృద్ధిగా వచ్చినా, కృష్ణ నీళ్లను సకాలంలో రాయలసీమకు తరలించడంలో జగన్ ఫెయిలయ్యారని, విజయవాడలోని తన ఇంటిని నీళ్లలో ముంచడం కోసం వృధాగా సముద్రంపాలు చేశారని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపించడం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత వెలువడిన జీవో నెం.69 ప్రకారం నీటిమట్టం 834 అడుగులు, 107 జీవో ప్రకారం నీటి మట్టం 854 అడుగుల వరకు నిల్వలు అమలు చేయాల్సి ఉండగా, రెండు రాష్ట్రాలూ అడ్డగోలుగా విద్యుత్ ఉత్పతి చేపట్టడంతో నీటి మట్టం పడిపోయిందని, ఇప్పుడు తెలంగాణ తన వాటాను తోడేసుకుంటుండటంతో సీమ జిల్లాలు తల్లడిల్లే పరిస్థితికి వచ్చాయని రాయలసీమకు చెందిన రైతు సంఘాలు, అఖిలపక్షం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  Pothireddypadu : TDP MLC Supports YS Jagan | టిడిపి మౌనం తో జగన్ కి పెరుగుతున్న సపోర్ట్
  టార్గెట్ నీళ్లు కాదు.. కరెంటే..

  టార్గెట్ నీళ్లు కాదు.. కరెంటే..

  శ్రీశైలంలో ఏపీ సర్కారు కరెంటు ఉత్పత్తిని నిలిపేయడానికి కొద్ది గంటల ముందే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇదే కరెంటు అంశంపై సంచలనం ఆరోపణలు చేశారు. ‘‘పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి వద్ద బొక్కలు పెట్టి జగన్ నీళ్లు తీసుకెళితే.. శ్రీశైలానికి చుక్క నీరురాదు. దాంతో మూడు మేజర్ ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి పడకేస్తుంది. వాటికి ప్రత్యామ్నాయంగా రెండు రాష్ట్రాల్లో కొత్తగా ప్రైవేటు విద్యుత్ సంస్థలు పుట్టుకొస్తాయి. అంటే జీవో 203 అసలు టార్గెట్ నీళ్లు కాదు, కరెంటే. భారీ కమిషన్ల కోసమే ఇద్దరు సీఎంలు కూడబలుక్కొని ఈ ప్లాన్ కు అంగీకరించారు. దీని వెనుక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల లాబీయింగ్ ఉంది''అని రేవంత్ వివరించారు. కాంగ్రెస్ ఎంపీ ఆరోపణలపై రెండు రాష్ట్రాలూ మౌనం వహించడం గమనార్హం.

  English summary
  amid pothireddypadu issue, andhra pradesh govt stopped power generation at srisailam right bank power house on thursday. but telangana continues to use their quota through left bank power house
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X