వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచ్చోడి చేతిలో రాయి .. మీ చేతిలో అధికారం ఒక్కటే .. జగన్ పై కేశినేని

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ పై విమర్శలు గుప్పించిన కేశినేని నాని || Keshineni Nani Criticized CM Jagan On Government Jobs

విజయవాడ టీడీపీ ఎంపీ, ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను సోషల్ మీడియా వేదికగా తిట్టి పోస్తున్న కేశినేని నాని తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ఒకపక్క అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని నానీ ఒకపక్కా టీడీపీ సస్పెన్షన్ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా దాని గురించి మాట్లాడటం నా పరిధి కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

ఎవరైనా చనిపోతే స్కూల్ కు సెలవొస్తుందని ..తోటి విద్యార్థినిపై హత్యాయత్నం చేసిన విద్యార్థినులుఎవరైనా చనిపోతే స్కూల్ కు సెలవొస్తుందని ..తోటి విద్యార్థినిపై హత్యాయత్నం చేసిన విద్యార్థినులు

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు కేశినేని నానీ . జగన్ రెడ్డి గారు, పిచ్చివాడి చేతిలో రాయిలా ఉంది మీ చేతిలో అధికారం' అంటూ ఎద్దేవా చేశారు . విజయవాడ ఎంపీ కేశినేని నాని. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.మీరు చేసిన చట్టమే ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీలాంటి చోట్ల మన వారికి ఉద్యోగాలు వస్తాయా? అని కేశినేని నాని జగన్ ను తన ట్వీట్ ద్వారా నిలదీశారు. 'అమ్మ పెట్టలేదు... అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది పరిస్థితి' అని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేశినేని నాని ట్వీట్ చేశారు.

power in your hands is like a stone in the hands of a mad man Keshineni stated on Jagan

ఎంపీ కేశినేని నాని ఉద్దేశంలో జగన్ సర్కారు చెప్పిన 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రకటన ఆచరణ సాధ్యం కాదు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే సీన్ లేదు. అలాగే జగన్ తరహాలో ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అక్కడ పని చేయడానికి తెలుగు వారికి అవకాశం కూడా దొరకదు. అందుకే ఆయన అమ్మ పెట్టా పెట్టదు... అడుక్కు తిననివ్వదు అంటూ జగన్ నిర్ణయం పై సెటైర్ వేశారు. పిచ్చోడి చేతిలో రాయి, మీ చేతిలో అధికారం రెండు ఒకటే అంటూ మండిపడ్డారు. తలాతోకాలేని నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారని నాని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Keshineni Nani criticized the Jagan government's statement that 75 per cent of jobs are for locals. Asked what the law is that you have done, and what other states if implements ..Do we get jobs in Hyderabad, Bangalore, Chennai, Mumbai, Pune or Delhi? Kesineni Nani asked Jagan in his tweet. Jagan Reddy power in your hands is like a stone in the hands of a mad man Keshineni stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X