• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబును వదల బొమ్మాళీ అంటున్న విజయసాయి! అధికారమంటే దోచుకోవడం.. దాచుకోవటం కాదంటూ ట్వీట్లు

|

విజయసాయి రెడ్డి చంద్రబాబు అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే నేత .. వైసీపీ ఎంపీగా , జగన్ కు సన్నిహితుడిగా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఎన్నికల సమయంలో ఏకిపారేశారు. ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును మాత్రం వదల బొమ్మాలీ వదల అంటున్నాడు. అందులో భాగంగా తాజాగా చంద్రబాబుపై మరోమారు ట్వీట్లతో దాడి చేశారు.

జన్మభూమి కమిటీల మాఫియాకు కాలం చెల్లింది అన్న విజయసాయి

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా సోమవారం ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో చంద్రబాబు పాలనను తిట్టిపోశారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చూపించారు. ఇక వైసీపీ పాలనలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని ఆయన పేర్కొన్నారు . గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయి అని చెప్పారు . చంద్రబాబు హయాంలో నేతలు వందల,వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. మా సిఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపడతాడనే భరోసా కనిపిస్తోందిప్పుడు అంటూ జగన్ పాలనకు కితాబిచ్చి చంద్రబాబు పాలన దోపిడీ పాలన అని మండిపడ్డారు.

చంద్రబాబు సీబీఐ ని బ్యాన్ చేస్తే జగన్ సీబీఐ కి రెడ్ కార్పెట్ పరచాడన్న వైసీపీ నేత విజయసాయి

అంతే కాదు తాజాగా సీబీఐ ని ఏపీలో అనుమతిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు సీబీఐ ని రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఇక నేపధ్యంలో ఇక సీబీఐని రాష్ట్రంలో చంద్రబాబు బ్యాన్ చేయగా.. జగన్ దానిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని దీనిని ఉద్దేశిస్తూ కూడా విజయసాయి కామెంట్ చేశారు. తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు.సీబీఐని బ్యాన్ చేశారు. ఐటీ దాడులను అడ్డుకున్నారు. ఈడీ ఎలా వస్తుందని గుడ్లురిమారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్ గారు ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ? అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబు సీబీఐ ని బ్యాన్ చేస్తే జగన్ సీబీఐ కి రెడ్ కార్పెట్ పరచాడని ఆయన పేర్కొన్నారు.

అధికారం అంటే దోచుకోటానికి దాచుకోటానికి కాదన్న విజయసాయి

ఇక టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలిందని టీడీపీ నాయకులు దోచుకున్నారని చెప్పిన విజయసాయి అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు . కానీ మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు .ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలని చెప్పారు . జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటూ విజయసాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayasai Reddy gets fired on Chandrababu , Vijayasai Reddy is the leader of the YCP , MP and the representative to Jagan mohan Reddy . Vijay Sai Reddy taken Twitter as the venue for tweeting tweets against Chandrababu at the time of the election. Even after coming to the power of YCP in the AP, Vijayasai Reddy says that he will not leave Chandrababu . As part of it Chandrababu was again attacked by tweets .The term for the Mafia of the JanmaBhoomi committees in the rule of the YCP has been destroyed, he said. He said the welfare schemes will go through the grama sabhas and also said if the Chandrababu bans the CBI, Jagan has made a red carpet to the CBI. Vijayasai Reddy blamed TDP and Chandra Babu and had made it clear that the power is not looting or hiding .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more