వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీపీఏల సమీక్షపై కేంద్రం చెక్ ....! సీఎం జగన్‌కి లేఖ రాసిన విద్యుత్‌ మంత్రి..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలపై పున:సమీక్ష చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యుత్ డిస్కంల నష్టానికి అధిక టారీఫ్‌లే కారణమనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రం వ్యతిరేకించింది. విద్యుత్ నష్టాలకు అనేక కారణాలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వాలు జరిపిన ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని ఈ సంధర్భంగా స్పష్టం చేశారు.

 విద్యుత్ ఒప్పందాల సమీక్షపై ప్రధానికి లేఖ రాసిన ఏపీ

విద్యుత్ ఒప్పందాల సమీక్షపై ప్రధానికి లేఖ రాసిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు సైతం చేపట్టింది. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై వివాదాలు సైతం చెలరేగాయి. విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇస్తూ లేఖ రాసింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని వివరిస్తూ... అందుకే విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేస్తున్నామని జులై 25న ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వ లేఖపై స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ

రాష్ట్ర ప్రభుత్వ లేఖపై స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ

అయితే రాష్ట్రప్రభుత్వం రాసిన లేఖను ప్రధాని కార్యాలయంల కేంద్ర విద్యుత్‌శాఖకు బదిలీ చేశారు. దీంతో విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కేసింగ్ ముఖ్యమంత్రి జగన్‌కు నేరుగా సమాధానం ఇస్తూ లేఖ రాశారు. లేఖలో భాగంగా విద్యుత్ ఒప్పందాల సమీక్షపై పలు అంశాలను ఆర్కేసింగ్ ప్రస్తావించారు. ముఖ్యంగా డిస్కం ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించించారు. 2016-17 ఏపీలో జరిగిన ఒప్పందాలకంటే అధికంగా రాజస్థాన్, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉన్నాయని వివరించారు. ఈ సంధర్భంగా ప్రతిసంవత్సరం ధరలు మారుతాయనే అంశాన్ని గమనించాలని ఆయన లేఖలో పేర్కోన్నారు.పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఆర్కేసింగ్ తెలిపారు. సమీక్ష వల్ల పెట్టుబడిదారులతో పాటు దేశంలో విద్యుత్‌రంగ విధానంపై కూ ప్రభావం పడనుందని పేర్కోన్నారు.

పీపీఏల రద్దుపై కోర్టులో కూడ చుక్కెదురు

పీపీఏల రద్దుపై కోర్టులో కూడ చుక్కెదురు


ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో గత ప్రభుత్వంలో జిరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే జీవో రద్దుపై విద్యుత్ కంపనీలు అసంతృప్తిని వెళ్లగక్కారు. అనంతరం వ్యాపారులు ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దును కోరుతూ.. హై కోర్టుకు వెళ్లడంతో కోర్టు సైతం ప్రభుత్వం తెచ్చిన జీవోను రద్దు చేసింది. పీపీఏలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతోపాటు ఇప్పటి వరకు నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
Power Minister RK Singh has asked Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy not to revisit PPAs as this sends wrong signals to investors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X