వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతపురం పొలాల్లో పీపీఈ కిట్ల కలకలం .. కరోనా భయంతో ఏం చేశారో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు వేసుకునే పీపీఈ కిట్లు ( పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) పొలాల్లో దర్శనం ఇస్తే ఏమవుతుంది. ఏపీలో పొలాల్లో పీపీఈ కిట్లు దర్శనం ఇవ్వటంతో అదే జరిగింది . స్థానికుల భయంతో అక్కడ కలకలం రేపింది . అసలే ఏపీలో ప్రజలు కరోనా భయంతో విలవిలలాడుతుంటే ఇక కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు ధరించే పీపీఈ కిట్లు పొలాల్లో కనిపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే..

ఏపీలోని ఆ గ్రామ ప్రజలకు కరోనానే కాదు డయేరియా భయం .. 52 మందికి అస్వస్థతఏపీలోని ఆ గ్రామ ప్రజలకు కరోనానే కాదు డయేరియా భయం .. 52 మందికి అస్వస్థత

పొలాల్లో దర్శనం ఇచ్చిన పీపీఈ కిట్లు .. అనంతపురం జిల్లాలో కలకలం

పొలాల్లో దర్శనం ఇచ్చిన పీపీఈ కిట్లు .. అనంతపురం జిల్లాలో కలకలం

ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని బోరంపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌ సేవ‌లు అందిస్తున్న డాక్టర్లు ధ‌రించే పీపీఈ కిట్ల బాక్సులు పొలాల్లో కనిపించాయి. దీంతో స్థానికులు అవి ఎవరు ధరించిన కిట్లో , వాటితో తమకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉందేమో అని భయపడి వాటిని తగలబెట్టారు. రోడ్డు ప‌క్క‌న ఉన్న పొలాల్లో రెండు బాక్సులు ప‌డి ఉండటంతో వాటిలో ఏముందో అని గ‌మ‌నించిన స్థానిక యువకుడు బాక్సులు తెరిచి చూశాడు. అందులో డాక్టర్లు ధ‌రించే పీపీఈ కిట్లు ఉన్నాయి.

 కరోనా సోకుతుందేమో అని భయంతో తగలబెట్టిన స్థానికులు

కరోనా సోకుతుందేమో అని భయంతో తగలబెట్టిన స్థానికులు

అవి రోగులకు వాడిన కిట్లేమో అని అతడు తీవ్ర ఆందోళ‌న‌ చెందాడు. వెంటనే కొన్నింటిని అక్క‌డే త‌గ‌ల‌బెట్టాడు. వాటి ద్వారా క‌రోనా సోకుతుందేమో అన్న భ‌యంతో తాను ఈ పని చేశానని చెప్పాడు . మళ్ళీ అవి కొత్త వాటిలా ఉండటంతో ఈ లోపు స్థానికులు అక్కడకు చేరటంతో ఒక బాక్సును మాత్రమే తగలబెట్టిన యువకుడు మ‌రో బాక్స్‌ను స్థానిక పోలీస్‌ స్టేష‌న్‌లో అప్ప‌గించాడు. దీనిపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

దర్యాప్తు చేస్తున్న అధికారులు

దర్యాప్తు చేస్తున్న అధికారులు

ఈ పీపీఈ కిట్లు త‌మ‌వేన‌ని జిల్లా వైద్యాధికారులు చెబుతుండ‌గా, స్థానిక అధికారులు మాత్రం ఈ పీపీఈ కిట్ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని అంటున్నారు. దీంతో అసలు ఈ కిట్లు ఎక్కడివి అనే గందరగోళం నెలకొంది. ఓ వైపు పీపీఈ కిట్లు లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే, ఇలా పొలాల్లో కిట్లు పడి ఉండటంపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. కిట్ల‌ను త‌ర‌లించే క్ర‌మంలో జారి రోడ్డుప‌క్క‌న ఉన్న పొలాల్లో ప‌డి ఉండొచ్చని మ‌రికొంద‌రు అంటున్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు .

English summary
The incident took place in Borampalli in Kalyanadurgam , Anantapur district of AP. The locals burned the PPE kits when they found in the farm . fearing that they might be infected with the coronavirus they burnt the PPE kits .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X