వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ఆర్ బాటలోనే జగన్: పాదయాత్ర టార్గెట్ అదే,కలిసొచ్చేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: తండ్రి బాటలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పయనిస్తున్నాడు. పాదయాత్ర సందర్భంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలను తెలుసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే నవరత్నాల పేరుతో వైఎస్ జగన్ ఇప్పటికే తాను అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాలను ప్రకటించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొంటున్నారు. ఇప్పటికే సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగింది

వైఎస్ఆర్ బాటలోనే వైఎస్ జగన్

వైఎస్ఆర్ బాటలోనే వైఎస్ జగన్

వైఎస్ఆర్ బాటలోనే వైఎస్ జగన్ పయనిస్తున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడ వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకొని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పటికే నవరత్నాల పేరుతో వాగ్ధానం చేశారు. అంతేకాదు ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా నవరత్నాల వాగ్ధానాలను మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.

ప్రజల సమస్యలకు అనుగుణంగా వాగ్ధానాలు

ప్రజల సమస్యలకు అనుగుణంగా వాగ్ధానాలు

ప్రజల సమస్యలను వింటూ వాటి పరిష్కారం కోసం తాము అధికారంలోకి వస్తే మెరుగుగా ఏ రకమైన పథకాలను అమలు చేస్తామో జగన్ ప్రకటిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలోని 55 లక్షల మంది సన్న, చిన్న కారు రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు హమీ ఇచ్చారు.చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పిస్తామని హమీ ఇచ్చారు.ఆరోగ్యశ్రీని మరింత మెరుగ్గా అందించనున్నట్టు చెప్పారు.

పాదయాత్రలో బాబుపై విమర్శలు

పాదయాత్రలో బాబుపై విమర్శలు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ చీఫ్ జగన్ విమర్శలు గుప్పిస్తూ పాదయాత్రను చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్థానాలు అమలు చేయలేదని జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా బాబును ఇరుకునపెట్టేలా జగన్ ఈ పాదయాత్రను ఉపయోగించుకోవాలని భావించారు. కానీ, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టిడిపిలో చేరుతుండడం వైసీపీని ఇబ్బందులకు గురి చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Recommended Video

సర్వేలు: జగన్‌కు, చంద్రబాబుకు షాక్
పాదయాత్ర కలిసొచ్చేనా

పాదయాత్ర కలిసొచ్చేనా


ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా కావడానికి దోహదపడింది. చంద్రబాబునాయుడు చేసిన పాదయాత్ర నవ్యాంధ్ర రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా కావడానికి దోహదపడింది. పాదయాత్ర సందర్భంగా ప్రజల నుండి సమస్యలను తెలుసుకొని మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్ర జగన్ కు రాజకీయంగా కలిసోస్తోందా లేదా అనేది 2019 ఎన్నికలు తేల్చనున్నాయి.

English summary
AP Opposition leader and YSRCP President Y S Jagan Mohan Reddy has started padayatra in the name of Praja Sankalpa Yatra in the state of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X