వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో జవదేకర్ భేటీ: తేలుతుందన్న కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakash Javadekar resumes talks with Chandrababu
హైదరాబాద్: సీట్ల కేటాయింపుపై తెలుగుదేశం పార్టీతో జరుగుతున్న చర్చల్లో తలెత్తిన ప్రతిష్టంభనను తొలగించేందుకు బిజెపి నాయకత్వం రంగంలోకి దిగారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో ప్రకాశ్ జవదేకర్ అతని బృందం శనివారం ఉదయం సమావేశమయ్యారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుపై తమ పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని, ఈ రోజు సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఎంత తొందరగా పొత్తుల వ్యవహారం తేలితే అంత మంచిదని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదని, నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రజలకు తమ పార్టీకే ఓటు వేయాలని ఆయన అన్నారు. ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల్లో తమ పార్ట అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి తీవ్రస్థాయిలో కృషి చేస్తారని ఆయన చెప్పారు.

కాగా, తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారంపై తమ పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలో అన్నారు. పొత్తు రెండు పార్టీలకు కూడా మేలు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

English summary

 BJP senior leader Prakash Javadekar met Telugudesam party president Nara Chandrababu Naidu to discuss about the alliance and on seat sharing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X