వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దట్ ఈజ్ నీలం!: తొలిరోజే రాజీనామా చేశారన్న ప్రణబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
అనంతపురం: నీలం సంజీవ రెడ్డి లోకసభకు ఎన్నికైన తొలిసారే స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారని, స్పీకర్ పదవి ప్రాధాన్యతను గుర్తించి ఆ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కాంగ్రెసు పార్టీ పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం అన్నారు. నీలం శతజయంతి ముగింపు వేడుకలు అనంతపురం జిల్లాలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొని ప్రసంగించారు.

అతిపిన్న వయస్సులో కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన నీలం... 1977-82 మధ్య రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా, లోకసభ స్పీకర్‌గా ఇలా ఎన్నో పదవులు చేపట్టారన్నారు. దేశంలోనే అత్యంత గుర్పింపు పొందిన నాయకుడన్నారు. నీలం శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నీలంకు అనేక ప్రత్యేక గుర్తింపులు ఉన్నాయని, రికార్డులు సాధించారన్నారు.

రాష్ట్రపతిగా, రెండుసార్లు సిఎంగా, స్పీకర్‌గా ఇన్ని పదవులు చేపట్టిన ఏకైక భారతీయుడు నీలం మాత్రమేనన్నారు. లోకసభ స్పీకర్‌గా నీలం సంప్రదాయాలు పాటించారన్నారు. అవిశ్వాసం సమయంలో సభను చర్చకు పెట్టి సభా సంప్రదాయం పాటించారన్నారు. మద్రాసు రాష్ట్రంలో కూడా మంత్రిగా పని చేసిన చరిత్ర ఉందన్నారు. దేశ స్వాతంత్రం కోసం నీలం చదువును వదులుకున్నారన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లారన్నారు.

నీలం చిన్నప్పటి నుండి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో పని చేశారన్నారు. లక్ష్యం కోసం పని చేస్తే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని నీలంను చూస్తే అర్థమవుతుందన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. ప్రభుత్వంలో, రాజకీయాల్లో ఆదర్శప్రాయుడన్నారు. మచ్చలేని రాజకీయ మగధీరుడని, కూడు, గుడ్డ, వైద్యం కోసం అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రజలకు ప్రణబ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

English summary
President Pranab Mukherjee praised former president Neelam Sanjeeva Reddy on Neelam's 100 years celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X