నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి జిల్లా అధ్యక్ష పదవికి ప్రసన్న కుమార్ రాజీనామా: జగన్ పార్టీ నేత అరెస్ట్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం కోటలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయసాయిరెడ్డికి లేఖ పంపానన్నారు.

అయితే పార్టీని వీడేది లేదని, చివరి శ్వాస వరకు జగన్మోహన్‌రెడ్డి వెంట ఉంటానని అయన స్పష్టం చేశారు. కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో తరచుగా పర్యటిస్తూ అభిమానులకు అండగా ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శిలాఫలకంపై పేరు లేదని నిరసన

Prasanna kumar resigns for YSR Congress Party's district president position

నెల్లూరు: కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం వద్ద రోడ్డు నిర్మాణానికి టిడిపికి చెందిన కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. అయితే శిలాఫలకంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎంపిటిసి మొహిదీన పేరు లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

టిడిపి ఎంపిటీసి పేరు వేసి, తమ ఎంపిటీసి పేరు పేరు ఎందుకు రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

వైసిపి నేత కెజె కుమార్ అరెస్ట్

చిత్తూరు జిల్లా నగరిలో వైయస్సార్ కాంగ్రెైస్ పార్టీ నేత కెజె కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ కమిషనర్ బాలాజీపై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం పుత్తూరు పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు.

English summary
YSR Congress Party MLA Prasanna kumar resigned for his YSR Congress Party's Nellore district president position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X