వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు చేస్తోన్న విమర్శలపై తొలిసారిగా నోరు విప్పిన ప్రశాంత్ కిశోర్

|
Google Oneindia TeluguNews

పాట్నా: రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించినప్పటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నిచోట్లా చేస్తోన్న విమర్శ.. బిహార్ తరహా రాజకీయాలు. దాదాపు ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో బిహార్ తరహా వాతావరణం ఏర్పడుతుందని, హత్యలు, దారుణాలు పెరిగిపోతాయని, రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందంటూ చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. బిహార్ గూండా ప్రశాంత్ కిశోర్ వైఎస్ఆర్ సీపీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని చంద్రబాబు నేరుగా ఆయనను విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది ఓట్ల తొలగింపు, డేటా లీకేజీ, డేటా చోరీ వెనుక ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని ఆరోపించారు.

మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. బిహార్ గుండాలు, దోపిడీదారులు రాష్ట్రంలో పాగా వేస్తారని, వారిని తరిమి కొట్టే సత్తా తమకే ఉందని అంటున్నారు. దీని వెనుక బిహార్ కు చెందిన కొందరు నాయకుల హస్తం ఉందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరును పరోక్షంగా ఉటంకిస్తున్నారు. తనతో పాటు బిహార్ తరహా వాతావరణం, రాజకీయాలపై చంద్రబాబు చేస్తోన్న ఆరోపణలపై ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా స్పందించారు. చంద్రబాబు చురకలు అంటించారు.

ప్ర‌చారంలో కూడా త‌డ‌బ‌డితే ఎలా లోకేష్ ..? టెక్నాల‌జీ ఎంత డెవల‌ప్ అయ్యిందో తెలుసుగా..!!ప్ర‌చారంలో కూడా త‌డ‌బ‌డితే ఎలా లోకేష్ ..? టెక్నాల‌జీ ఎంత డెవల‌ప్ అయ్యిందో తెలుసుగా..!!

Prashant Kishor critics on ap cm chandrababu naidu

చంద్రబాబు సీజనల్ పొలిటీషియన్

చంద్రబాబును ఆయన సీజనల్ పొలిటీషియన్ గా పోల్చారు. ఘోర పరాజయం పలకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలాంటి సీజనల్ రాజకీయ నాయకుడైనా.. ఇలాగే స్పృహ తప్పి మాట్లాడుతారని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. తనపైన, తన రాష్ట్రమైన బిహార్ పైనా చంద్రబాబు చేస్తోన్న నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓడిపోవడానికి సిద్ధమైన చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి విమర్శలు రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించట్లేదని చెప్పారు.

ప్రజాస్వామ్య దేశంలో బిహార్ ఓ రాష్ట్రమనే విషయాన్ని చంద్రబాబు విస్మరించినట్టు ఉన్నారని అన్నారు. అభ్యంతరకరమైన పదజాలంతో బిహార్ ను విమర్శించే బదులు.. ప్రజలు తనకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయబోతున్నారనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. బిహార్ పై అసూయ, ధ్వేషాలతో విషం చిమ్మడాన్ని మానుకోవాలని ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుకు చురకలు అంటించారు.

English summary
Janata Dal (United) leader, Top Political strategist Prashanth Kishor strongly condemned the comments of Chief Minister of Andhra Pradesh Nara Chandra babu Naidu. He says, An imminent defeat can rattle even the most seasoned politicians. So I’m not surprised with the baseless utterances of Chandrababu comments, Prashanth Kishor added. Sirji rather than using derogatory language that shows your prejudice & malice against Bihar, just focus on why people of AP should vote for you again.. He tweeted on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X