ఇదీ ప్రశాంత్ కిషోర్ అసలు వ్యూహం: 'సర్వే' తమ ప్రవృత్తి కాదన్నాడు!..
క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ బృందం సంస్థాగత విశ్లేషణకు సిద్దమవుతున్నట్లు జగన్ పార్టీ నేతలకు వివరించారు.
హైదరాబాద్: ఇంకా బరిలోనే దిగలేదు.. మీడియా మాత్రం ప్రశాంత్ కిషోర్ వ్యూహాస్త్రాలు మొదలైపోయాయి అని గత కొద్దిరోజులుగా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాల ఉపఎన్నిక విషయంలోను జగన్ కు ప్రశాంత్ కిషోర్ పలు వ్యూహాలను సిద్దం చేశారన్న ప్రచారం కూడా జరిగింది.
కానీ అవన్ని వట్టి ఊహాగానాలేనని తామింకా పనే మొదలుపెట్టలేదని తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో.. చూచాయగా పార్టీ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. కాగా, 2019ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా.. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహాలను సిద్దం చేసే పనిని ఆయన భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే.

పార్టీ కీలక సమావేశంలో:
బుధవారం నాడు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత అధ్యక్షతన పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు కీలక నేతలు, జిల్లా స్థాయి నేతలు పాల్గొనగా.. సమావేశానికి ప్రశాంత్ కషోర్ ను కూడా ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులను జగన్ ఆయనకు పరిచయం చేశారు.

సంస్థాగత విశ్లేషణ.. శాస్త్రీయ పరిశీలన:
క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ బృందం సంస్థాగత విశ్లేషణకు సిద్దమవుతున్నట్లు జగన్ పార్టీ నేతలకు వివరించారు. శాస్త్రీయ దృక్పథంతోనే వ్యూహాస్త్రాలు ఉండబోతున్నాయని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ నియామకం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను కూడా జగన్ నేతలకు చెప్పారు.

'సర్వేలు' ప్రవృత్తి కాదని కుండబద్దలు:
వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల పవనాలే వీస్తాయన్న ఊహాగానాలపై జిల్లా అధ్యక్షుడు ఒకరు ప్రశాంత్ కిషోర్ ను ప్రశ్నించారు. సర్వేల పేరిట టీడీపీ అనుకూల మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతుందని, ఆ సర్వే కూడా మీరే చేయించారన్నట్లు చెబుతున్నారని అడిగారు. దీనికి స్పందించిన ప్రశాంత్ కిషోర్.. అసలు సర్వేలు తమ ప్రవృత్తి కానే కాదని కుండబద్దలు కొట్టేశారు.

ఇదీ ప్లాన్:
క్షేత్రస్థాయిలో జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో తమ బృందం సభ్యులు సంబంధాలు కలిగి ఉంటారని సమావేశంలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి లోపమున్నా.. వెంటనే దాన్ని పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లాల్లో ఒక బృందం, వాటి పనితీరును సమన్వయపరిచేలా మరో బృందం పనిచేస్తాయని అన్నారు. తమ బృందం పరిశీలనలో తేలే లోపాలను నేతలను వెంటనే సవరించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృ ష్ణారెడ్డి, ఆది శేషగిరిరావు, 13జిల్లాల పరిశీలకులు పాల్గొన్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications