వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, వైసీపీల మధ్య రాజీ, 9 హమీలు గులకరాళ్ళే: యనమల

వైసీపీ, కాంగ్రెస్‌పార్టీల మధ్య రాజీ కుదుర్చుకొనేందుకే ప్రశాంత్‌కిషోర్ కన్సల్టెన్సీ పెట్టుకొన్నారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైసీపీ, కాంగ్రెస్‌పార్టీల మధ్య రాజీ కుదుర్చుకొనేందుకే ప్రశాంత్‌కిషోర్ కన్సల్టెన్సీ పెట్టుకొన్నారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

ప్లీనరీలో వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించిన 9 హమీలు నవరత్నాలు కావని, 9 గులకరాళ్ళన్నారు. వైసీపీ హమీల బడ్జెట్‌పై జనం భయపడడం లేదన్నారు. వైసీపీ విధ్వంసకధోరణి గురించేనని ఆయన విమర్శించారు.

 Prashanth kishor tries compromise between Yscrp and Congress :Yanamala Ramakrishnudu

వైసీపీ ఇచ్చిన హమీలు కొత్తవికావన్నారు. 2004,2009,2014 ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీలు ఇచ్చిన హమీలేనని ఆయన గుర్తుచేశారు.

24 లక్షల మంది చిన్నరైతులకు రూ.50వేలు ఒకే దఫా చెల్లించామని, ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్ళులో ఇస్తే రైతులకు ఏం ప్రయోజనం కలుగుతోందని ఆయన ప్రశ్నించారు.

దశలవారీ మధ్యనిషేధం 2004లో చెప్పిందేనని కొత్తదేమీకాదన్నారు. 18శాతం అపరాధరుసుం చెల్లించని ఒక్క రైతును చూపించమన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఛాలెంజ్‌కు వైసీపీ ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు.

బకాయిలన్నీ చెల్లించండి.. ఏడాదికింత చెల్లిస్తామన్ని హమీ హస్యాస్పదంగా ఉందన్నారు. అమ్మ ఒడికి హమీని ప్రజలు 2014లోనే తిరస్కరించారని యనమల గుర్తుచేశారు. ప్రశాంత్‌కిషోర్‌ను రాహుల్ వాడుకొన్నారని కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. అందుకే ఇప్పుడు జగన్ తెచ్చుకొన్నాడని ఆయన చెప్పారు.

నియోజకవర్గాల పెంపెను రాహుల్ వ్యతిరేకించడం ద్రోహమన్నారు. నియోజకవర్గాల పెంపును రాహుల్ వ్యతిరేకించడం రాజకీయ, సామానిక ద్రోహనికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రానికి పట్టిన చీడ కాంగ్రెస్, వైసీపీల పీడ వదిలిపోతోందని యనమల అభిప్రాయపడ్డారు.

English summary
Prashanth kishor trying compromise between Yscrp and Congress alleged Andhra pradesh finance minister Yanamala Ramakrishnudu. He spoke to media at Vijayawada on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X