వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 కోసం జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన, పవన్ కళ్యాణ్‌తో కలిసేనా?

ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 నాటికి ఏ పార్టీ ఏ పార్టీతో వెళ్తుంది, ఎవరు ఒంటరిగా వెళ్తారనే అంశం ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 నాటికి ఏ పార్టీ ఏ పార్టీతో వెళ్తుంది, ఎవరు ఒంటరిగా వెళ్తారనే అంశం ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తోంది.

టిడిపి, బిజెపి పొత్తు అంశంపై తేలిపోయినట్లే కనిపిస్తోంది. అంతలోనే మళ్లీ అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై ఇరు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అయినప్పటికీ తేలినట్లుగా కనిపించడం లేదు.

ఏపీకి వెళ్లిపోండి!: జగన్‌కు ప్రశాంత్ కిషోర్ సూచన, 'సాక్షి' కూడా...ఏపీకి వెళ్లిపోండి!: జగన్‌కు ప్రశాంత్ కిషోర్ సూచన, 'సాక్షి' కూడా...

మరోవైపు, ప్రతిపక్షాలు కూడా ఎవరు ఎవరితో వెళ్తారనేది చర్చకు దారి తీస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే టిడిపి - బిజెపిలకు దూరమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన లెఫ్ట్ పార్టీల వైపు చూస్తున్నారు.

అందరూ సిద్ధమంటున్నారు

అందరూ సిద్ధమంటున్నారు

ప్రత్యేక హోదా అంశమే ఆయుధంగా జనసేన, లెఫ్ట్ పార్టీలు 2019 ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామని పవన్ కళ్యాణ్, లెఫ్ట్ నేతలు చెబుతున్నారు.

దానిపై లెఫ్ట్ ఆగ్రహం

దానిపై లెఫ్ట్ ఆగ్రహం

వైసిపి అధినేత జగన్‌తోను కలిసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ, ఆ తర్వాత ఆయనను ప్రశంసించడంతో లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ సూచన

ప్రశాంత్ కిషోర్ సూచన

అయితే, టిడిపి-బిజెపిల పొత్తు దాదాపు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు ఓ సూచన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన కూటమి అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.

2019లో అధికారంలోకి రావాలంటే..

2019లో అధికారంలోకి రావాలంటే..

2014 ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమి, పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా జగన్‌కు దెబ్బపడింది. 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసిపి చూస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపిపై ఆశలు పక్కన పెట్టి టిడిపి-బిజెపియేతర పార్టీలతో కలిసి ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.

జగన్-పవన్‌లు దగ్గరవుతారా

జగన్-పవన్‌లు దగ్గరవుతారా

ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్‌కు అధికార యావ లేదు. లెఫ్ట్ పార్టీలు కూడా జగన్‌తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా విపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా సభను నిర్వహించనుంది. ఈ సభకు పవన్, జగన్‌లను కూడా ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే.

English summary
Prashanth Kishore suggetion to YS Jagan to win in 2019 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X