వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భేటీలో ప్రశాంత్ కిషోర్, 'లోకేష్ సేల్స్ మేనేజర్‌గా వెళ్లాలని..'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు, పార్టీ నేతలతో భేటీ అయ్యారు. త్వరలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీప

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు, పార్టీ నేతలతో భేటీ అయ్యారు. త్వరలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీపై చర్చించారు.

చెప్పుతో కొడతారు: వర్మకు పోసాని హెచ్చరిక, లక్ష్మీపార్వతి 'బాలకృష్ణ' వ్యాఖ్యపై నోచెప్పుతో కొడతారు: వర్మకు పోసాని హెచ్చరిక, లక్ష్మీపార్వతి 'బాలకృష్ణ' వ్యాఖ్యపై నో

ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలుపుకు ఆయన వ్యూహకర్తగా పని చేశారు. ఇప్పుడు ఆయన వైసిపి కోసం పని చేస్తున్నారు. ఆయనను జగన్ అందరికీ పరిచయం చేశారు.

30 వేల మంది హాజరవుతారని అంచనా

30 వేల మంది హాజరవుతారని అంచనా

జూలై 8, 9వ తేదీల్లో వైసిపి ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంకు ఎదురుగా ఉన్న పన్నెండు ఎకరాల స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. దాదాపు 30 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్లీనరీ కోసం 18 కమిటీలు ఏర్పాటు చేశారు.

హెరిటేజ్ వాహనాల్లో దుంగలే నిదర్శనం

హెరిటేజ్ వాహనాల్లో దుంగలే నిదర్శనం

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై వైసిపి నేత జోగి రమేష్ విజయవాడలో నిప్పులు చెరిగారు. టిడిపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. హెరిటేజ్ వాహనాల్లో ఎర్ర చందనం దుంగలు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం అని ఆరోపించారు.

వైసిపిపై ఒక్కటైనా ప్రూవ్ చేశారా?

వైసిపిపై ఒక్కటైనా ప్రూవ్ చేశారా?

అనవసరంగా వైసిపి మీద అభాండాలు వేసిన చంద్రబాబు తన ప్రభుత్వంలో ఏదైనా ప్రూవ్ చేయగలిగారా అని నిలదీశారు. సిబిఐ అంటే చంద్రబాబుకు ఎందుకు అంత భయమో చెప్పాలని జోగి రమేష్ అడిగారు. విశాఖలో లక్ష ఎకరాల భూమిని టిడిపి నేతలు మింగారని ఆరోపించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లుగా ఉందన్నారు.

సేల్స్ మేనేజర్లుగా వెళ్లాలి.. బాబు ఎప్పుడో జైలుకు వెళ్లారు

సేల్స్ మేనేజర్లుగా వెళ్లాలి.. బాబు ఎప్పుడో జైలుకు వెళ్లారు

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అల్జీమర్స్ రాకపోతే అలా ఎందుకు మాట్లాడుతారని జోగి రమేష్ ప్రశ్నించారు. బీరు హెల్తీ డ్రింక్ అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. మంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. మంత్రి లోకేష్.. జవహర్ మాటలకు వత్తాసు పలకడం విడ్డూరమన్నారు. మంద్రులు ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసి సేల్స్ మేనేజర్లుగా మారాలని సూచించారు. లోకేష్ పేరులో ఉన్న లోకజ్ఞానం ఆయనకు లేదన్నారు. ఏపీ ప్రజల మనసుల్లో చంద్రబాబు ఎప్పుడై జైలుకు వెళ్లారన్నారు.

English summary
election strategist Prashanth Kishore in YSRCP meeting on Wednesday. YSRCP chief YS Jaganmohan Reddy also participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X