వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! నీ కోరిక నెరవేరదు, ఎవరూ క్షమించరు: ప్రత్తిపాటి, వర్ల నిప్పులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6నుంచి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు ఆయన్ను క్షమించబోరని అన్నారు.

Recommended Video

శ్రీవారిని దర్శించుకున్న జగన్:మళ్లీ వివాదం ! ఎందుకంటే? | Oneindia Telugu
 జగన్‌ది విషపూరిత యాత్ర..

జగన్‌ది విషపూరిత యాత్ర..

గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఓ అహంకారి అని, ఈ విషయం అతని ప్రవర్తన చూస్తేనే అర్థమైపోతుందని అన్నారు. జగన్ చేస్తున్నది విషపూరితమైన పాదయాత్ర అని విమర్శించారు.

 జగన్ వైఖరిలో మార్పు రాలేదు..

జగన్ వైఖరిలో మార్పు రాలేదు..

ఇటీవల నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా జగన్ వైఖరిలో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. జగన్ తాము చేస్తోన్న అభివృద్ధి పనులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకుంటున్నామని ప్రత్తిపాటి చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు రహదారులను అభివృద్ధి చేశారని చెప్పారు.

 పాదయాత్ర సీఎం అయిపోతారా?

పాదయాత్ర సీఎం అయిపోతారా?

ఇది ఇలా ఉంటే, టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. పాదయాత్ర చేసిన ప్రతివారూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించబోరని అన్నారు. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు.

 జగన్ కష్టం వృథానే..

జగన్ కష్టం వృథానే..

జగన్ చెడు ఆలోచనలతో చేసే కోరిక అయినా నెరవేరదని అన్నారు. జగన్ పాదయాత్రలో వైసీపీ నేతలు కూడా పాల్గొనరని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర, ఆయన పడుతోన్న కష్టం అంతా వృథానే అని, సీఎం కావాలంటే ప్రజల హృదయాల్లో నిలవాలని అన్నారు.

English summary
Andhra Pradesh minister Prathipati Pulla Rao and Varla Ramaiah on Saturday lashed out at YSRCP president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X