• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రభుత్వ టీచర్లపై వ్యతిరేకత మొదలు: లేటుగా వచ్చారని గేటుకు తాళం వేసిన పేరెంట్స్: గుంటూరులో

|
Google Oneindia TeluguNews

గుంటూరు: పీఆర్సీ కోసం ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్టే కనిపిస్తోంది. వారి వైఖరికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. టీచర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నిరసన ప్రదర్శనలకు మద్దతు పలికారు. తల్లిదండ్రులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. మాకొద్దీ ప్రభుత్వ టీచర్లు అంటూ నినాదాలు చేశారు.

చంద్రబాబు ఇంటి గేటు దాటితే..తిరిగొచ్చేది కొడాలి నాని శవమే: బుద్ధా వెంకన్న: అరగంట చాలుచంద్రబాబు ఇంటి గేటు దాటితే..తిరిగొచ్చేది కొడాలి నాని శవమే: బుద్ధా వెంకన్న: అరగంట చాలు

 పాఠశాల గేటుకు తాళం..

పాఠశాల గేటుకు తాళం..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెదమక్కెనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ ఛైర్మన్, స్థానిక ఎంపీటీసీ, కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 9:05 నిమిషాల వరకు వేచి చూశారు. అప్పటికీ ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోవడంతో ప్రధాన గేటుకు తాళం వేశారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయుల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.

 టీచర్లమనే విషయాన్ని మర్చిపోయారు..

టీచర్లమనే విషయాన్ని మర్చిపోయారు..

ప్రభుత్వ టీచర్లు ప్రతిరోజూ పాఠశాల ఆలస్యంగా వస్తున్నారని పేరెంట్స్ ఆరోపించారు. ఈ విషయం మీద పలుమార్లు వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ.. పట్టించుకోవట్లేదని అన్నారు. విద్యార్థుల కంటే ముందే పాఠశాలకు చేరుకోవాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులమనే విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. ఊరిలోనే ఉంటూ సమయానికి పాఠశాలలు రాలేని ఉపాధ్యాయులు తమకు వద్దంటూ నినదించారు.

మీరసలు టీచర్లేనా..?

మీరసలు టీచర్లేనా..?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కించపరిచేలా పాటలు పాడారని, వారసలు టీచర్లేనా? అని ప్రశ్నించారు. లక్షల లక్షల జీతాలను తీసుకుంటూ, అది కూడా చాలట్లేదంటూ ప్రభుత్వాన్ని, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా పాటలు పాడుతూ క్యాబరే డాన్సులు చేశారని ధ్వజమెత్తారు. వాళ్లందరినీ విధుల నుంచి తొలగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సమయానికి పాఠశాలలకు రాని టీచర్లపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అలవెన్సులు వద్దు..

అలవెన్సులు వద్దు..

గ్రామాల్లోనే ఉండే ఉపాధ్యాయులకు ఎలాంటి అలవెన్సులను చెల్లించొద్దని, వందకు వంద శాతం ఫలితాలను సాధించలేని టీచర్లతో అవసరం లేదని తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు, పోలీసులు.. రేయింబవళ్లు కష్టపడ్డారని, ప్రజలకు అద్భుతమైన సేవలను అందించారని అన్నారు. ఉపాధ్యాయులు మాత్రం వేలకు వేల రూపాయల జీతాలను తీసుకుంటూ ప్రజలకు కనీస సేవలను చేయలేకపోయారని విమర్శించారు.

PRC Issue In AP: సమ్మె వద్దు.. చర్చించుకుందాం AP Govt VS Employees | Oneindia Telugu
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించలేని టీచర్లు అవసరమా?

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించలేని టీచర్లు అవసరమా?

అటువంటి ఉపాధ్యాయులు.. ఇప్పుడు జీతాలు చాలట్లేదంటూ ధర్నాలు, ఆందోళనలను చేపట్టడం సరికాదని అన్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని, హేళన చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రినే దించేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయడం వారి వైఖరికి అద్దం పడుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించలేని టీచర్లు అవసరం లేదని అన్నారు. టీచర్లు తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తేనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

English summary
PRC row: Parents and YSRCP leaders protest against the Government teachers in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X