వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు పొత్తే మేలు : కాంగ్రెస్ తో క‌లిసి ప‌ని చేస్తాం : చ‌ంద్ర‌బాబు కొత్త వ్యూహం..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ టిడిపి అధినేత చంద్ర‌బాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కేంద్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా పొత్తులు కుద‌ర్చుకుంటే మేల‌ని..ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుంద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

ముంద‌స్తు పొత్తు లేకుంటే..మోదీ ఇలా..
జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలన్నీ ముందస్తు ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటేనే మేలని, ఆ దిశగా అన్ని పా ర్టీలనూ ఒక తాటిపైకి తెచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ముం దస్తు పొత్తు లేకపోతే... ఎన్నికల తర్వాత భాజపాకి ఎక్కువ స్థానాలు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకి ఆ పార్టీనే రాష్ట్రపతి ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని, దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

pre poll alliance is must to face NDA : TDP chief chandra Babu

ఎన్నికల హడావుడిలో పడిపోయి... ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముగ్గురు నలుగురు మంత్రులు తప్ప మిగతా వారెవరూ విలేకరుల సమావేశా లు నిర్వహించి విపక్షాలపై ఎదురుదాడి చేయడం లేదు. మనం కౌంటర్‌ ఇవ్వకపోతే విపక్షాల వాదనే ప్రజల్లోకి వెళు తుంది. ఒక పక్క మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలసి రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే... మంత్రులు ఇలా ఉంటే ఎలా అని ఆయన చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తాం
కాంగ్రెస్‌ పార్టీతో జాతీయస్థాయిలోనే కలసి పనిచేస్తామని, రాష్ట్రంలో ఆ పార్టీతో ఎలాంటి ఎన్నికల అవగాహన ఉండద ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భాజపాయేతర పార్టీలన్నిటినీ సంఘటితం చేస్తున్నామని, ఆ ప్రయ త్నంలో భాగంగానే ఈ నెల 27న దిల్లీలో మరోసారి సమావేశమవుతున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోనూ ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌తో కలసి పనిచేయాలని చెబుతున్నామని, అలా కాదని అక్కడ ఎస్పీ, బీఎస్పీలు తృతీయ ఫ్రంట్‌గా విడిపోతే భాజపాకి అవకాశం ఇచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. ఈసారి భాజపాకి చావుదెబ్బ తప్పదని, మోదీ నిరాశా నిస్పృహల్లో ఉన్నారని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మోదీ పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడగడం ఎన్నికల దృష్టితో చేసిన చర్య మాత్రమేనన్న అభిప్రాయం మంత్రుల నుంచి వ్యక్తమైంది. భాజపాలో కూడా మోదీకి ప్రతికూల వాతావరణం పెరుగుతోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

English summary
TDp Chief chandra Babu suggesting alliance parties that pre poll alliance is must for up coming elections. TDP and Congress alliance will continue in national level only not in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X