వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిండు గర్బిణీ 5 గంటలు వెయిటింగ్: ల్యాబ్ వద్ద నిరీక్షించడం అసమర్థ పాలనకు నిదర్శనం: టీడీపీ అనిత

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. అయితే వైరస్ టెస్టుల కోసం జనం నిరీక్షిస్తున్నారు. అయితే సాధారణ ప్రజలు అయితే ఓకే.. కానీ ఓ గర్బిణీ 5 గంటలు వెయిట్ చేయించాయి. ఇదీ అధికారుల తీరు అని టీడీపీ మహిళ నేత అనిత మండిపడ్డారు. నిండు గర్బిణీని వెయిట్ చేయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదీ రాక్షస పాలనకు నిదర్శనంం అని ధ్వజమెత్తారు.

ఇటీవల రాష్ట్రంలో ఓ గర్బిణీ కరోనా వైరస్ పరీక్ష కోసం ల్యాబ్ వద్ద నిరీక్షించింది. అలా ఒకటి కాదు రెండు కాదు ఐదు గంటలు వెయిట్ చేసింది. నిండు గర్బిణీ వెయించడం అసమర్థుడి పాలనకు నిదర్శమని మండిపడ్డారు. ఆ గర్బిణీ కూర్చొవడానికి కూడా వసతి లేదు అని విమర్శించారు. పరీక్ష కోసం వచ్చిన గర్బిణీని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత సిబ్బందికి లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ వైరస్ లేని.. ఆమెకు అక్కడే సోకితే పరిస్థితి ఏంటీ అని అనిత ప్రశ్నించారు. ఈ ఘటనతో ప్రజలు రాష్ట్రంలో ఎంత దైన్యమైన స్థితిలో ఉన్నారో అర్థమవుతోందన్నారు.

pregnant waiting in the lab 5 hours for covid-19 test..

ఏపీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజుకు కనీసం 7 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 10వేలు దాటింది. మరి కొద్దిరోజుల్లో ఢిల్లీని దాటి మూడో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష 30 వేలకు పైగానే ఉంది. తొలి, రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుండగా.. మరోవైపు పరీక్షల కోసం గర్బిణీ నిరీక్షించడం కాస్త కలవరానికి గురిచేస్తోంది.

English summary
pregnant woman waiting in the lab 5 hours for covid-19 test in the andhra pradesh tdp anitha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X