వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపాడు

ఇన్సూరెన్స్ పొమ్ముకోసం స్వంత బావమరిదిని హత్య చేసిన ఓ వ్యక్తిని విశాఖపట్టనం పోలీసులు అరెస్టు చేశారు. నాగేంద్ర అనే వ్యక్తి తన బావమరిది వెంకటేష్ పేరు మీద 1.19 కోట్ల కు ఇన్సూరెన్స్ చేయించాడు. ఈ డబ్బు కోసం

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం :సులభంగా డబ్బులు సంపాదించాలనుకొన్నాడు. డబ్బు సంపాదన కోసం ప్రాణాలు తీసిన ఫర్వాలేదని భావించాడు. స్వంత బావమరిదిని హత్య చేశాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు సృష్టించాడు. సులభంగా డబ్బులు సంపాదించాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హత్య వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకొని పోలీసులే విస్తుపోయారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం స్వంత బావమరిదిని హత్య చేశాడు ఓ బావ.

విశాఖపట్టణానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అయితే దీనికి ఓ ఆలోచన వచ్చింది. పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించినట్టుగా సృష్టిస్తే ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకోవచ్చని భావించాడు. ఈ పథకం బాగానే ఉందనిపించింది. వెంటనే అమలు చేశాడు. ఏడాది తర్వాత జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

preplan murder for an insurance money in vizag

నాగేంద్ర పకడ్బంధీగా ప్లాన్ ను అమలు చేశాడు. కాని, చివరికి పోలీసులకు చిక్కాడు. నాగేంద్ర తన బావ మరిది వెంకటేష్ పేరు మీద 1.19 కోట్ల ఇన్సూరెన్స్ చేయించాడు. తన పేరున బావ కోటి రూపాయాల ఇన్సూరెన్స్ చేయించడంతో వెంకటేష్ ఉబ్బితబ్బియ్యాడు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించడం తన ప్రాణం మీదకి వస్తోందని ఆయన ఊహించలేకపోయాడు.

ఏడాది క్రితం వెంకటేష్ ను నాగేంద్ర హత్య చేశాడు. ఈ హత్యను ప్రమాదవశాత్తు మరణించినట్టుగా సృస్టించాడు. వెంకటేష్ రైలు నుండి జారిపడి మరణించినట్టు నాగేంద్ర నమ్మించాడు.వెంకటేష్ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ ను 69 లక్షలను క్లెయిమ్ చేశాడు.అయితే వెంకటేష్ మృతిపై అనుమానాలున్న పోలీసులు విచారణ జరిపారు. ఏడాది తర్వాత వాస్తవాలను బయటపెట్టారు.నాగేంద్ర ప్లాన్ ప్రకారంగా వెంకటేష్ ను హత్య చేశారని పోలీసులు గుర్తించారు.నాగేంద్రకు సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేశారు.

English summary
nagendra plan how to earn easy money. he is target his brother inlaw venkatesh . nagendra insurance on his brother in law around 1.19 crores.venkatesh happy about this. nagendra plan to murder venkatesh for insurance money. along with four members nagendra murdered his brother in law .nagendra claim 69 lakhs of venkatesh insurance claim. police enquired venkatesh death case, after year they known facts. police arrested nagendra and his supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X