అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గుంటూరు-తెనాలి' రాజకీయం అదిరిపోయింది!?

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాను పోటీచేసే నియోజకవర్గం గురించి సందేహంలో పడ్డారు.

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం దాదాపుగా ఖాయమైనట్లే. కాకపోతే ఇరు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాల్సిన నియోజకవర్గాలపై టీడీపీ ఒక స్పష్టతతో ఉంది. తనకు బలమున్న జిల్లాల్లోనే సీట్లు తీసుకోవాలని జనసేన భావిస్తోంది.

పొత్తులో భాగంగా తెనాలి కేటాయిస్తారా.

పొత్తులో భాగంగా తెనాలి కేటాయిస్తారా.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోకవర్గం నుంచి వరుసగా 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. గతంలో తాను రెండుసార్లు గెలుపొందిన నియోజకవర్గం కావడంతో తనకు పరిచయమున్న నాయకులందరినీ మండలాలవారీగా కలిసి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా తెనాలి జనసేనకు ఇస్తారని, అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆలపాటికి చంద్రబాబు ఏం చెప్పారో?

ఆలపాటికి చంద్రబాబు ఏం చెప్పారో?

టీడీపీ తరఫున గత ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇటీవలే చంద్రబాబును కలిశారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే తనకు గుంటూరు పశ్చిమ కేటాయించాలని కోరారు. తర్వాత తెనాలి పరిధిలోని నాయకులందరినీ వరుసపెట్టి కలుస్తున్నారు. గుంటూరు పశ్చిమ తనకివ్వకపోతే తెనాలి ఇస్తారని ఆ నాయకులందరికీ రాజా చెబుతున్నారు. చంద్రబాబు ఏం చెప్పారో? ఆలపాటి రాజాకు ఏమర్థమైందో తమకర్థం కావడంలేదని తెనాలిలోని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తెనాలి స్థానం గురించి నాదెండ్ల మనోహర్ కు అనుమానం ఏర్పడింది.

సత్తెనపల్లి కోసం జనసేనలో తీవ్ర పోటీ

సత్తెనపల్లి కోసం జనసేనలో తీవ్ర పోటీ


తెనాలి కాకపోతే గుంటూరు పశ్చిమ నుంచైనా పోటీచేయాలని తలపోస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా పశ్చిమను తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉండటంతో సత్తెనపల్లిపై దృష్టిసారించారు. కానీ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీచేయడానికి ఇక్కడ ముగ్గురికి మించిన అభ్యర్థులు పోటీపడుతున్నారు. సత్తెనపల్లిలో ఉన్న నాయకులతోపాటు గుంటూరు నుంచి వచ్చిన నాయకులు కూడా ఇక్కడినుంచి పోటీచేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరితే సత్తెనపల్లి సీటు నుంచే పోటీచేసే అవకాశం ఉంది. దీంతో పొత్తులను ఖరారు చేయగలిగే స్థాయిలో ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా తాను పోటీచేసే నియోజకవర్గం గురించి సందేహంలో పడిపోయారు. రాజకీయమంటే ఇదేనేమో!!.

English summary
Janasena political affairs committee chairman Nadendla Manohar is in doubt about the constituency he is contesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X