అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి ఫైలుపై సంతకమా? ఓట్లేసేది ఈవీఎంలా??

|
Google Oneindia TeluguNews

వైసీపీ అరాచక పాలనను అంతమొందిస్తానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, వారంతా అవినీతి పరులని, గూండాల్లా వ్యవహరిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయిన తర్వాత తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కోరుతున్న సంగతి తెలిసిందే.

ఆ రెండు పార్టీలకు భిన్నంగా ఉండాలి..

ఆ రెండు పార్టీలకు భిన్నంగా ఉండాలి..

వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి భిన్నంగా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కొంతమంది మేధావులను, ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారిని, నిజాయితీగా, నిబద్ధతతో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరైనవారిని, సంఘ సంస్కర్తలను .. ఇలాంటివారిని పార్టీలో చేర్పించుకొని ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ, సమావేశాలు ఏర్పాటుచేస్తూ ఉంటుందే ఈ రెండు పార్టీలకు భిన్నంగా జనసేన ఉందిరా అని ప్రజలు అనుకునేవారు. కానీ కొద్దిరోజులుగా వ్యూహం మారిందని చెబుతున్న జనసేనాని తెలుగుదేశం, వైసీపీలో టికెట్లు దక్కనివారిని పార్టీలో చేర్చుకుంటానని చెబుతున్నారు.

 ఇదేం రాజకీయమంటున్న పరిశీలకులు

ఇదేం రాజకీయమంటున్న పరిశీలకులు


వైసీపీని అధికారంలోకి రానివ్వని చెబుతూ, మరోవైపు ఆ పార్టీలోనే అవినీతికి పాల్పడినవారిని, దౌర్జన్యానికి పాల్పడేవారిని పార్టీలోకి చేర్చుకొని టికెట్లు ఇస్తాననడం.. ఇదేం రాజకీయమో అని పరిశీలకులు అంటున్నారు. తాను ముఖ్యమంత్రి అవగానే ఫలానా ఫైలు పై తొలి సంతకం చేస్తానని చెబుతున్న పవన్ కల్యాణ్ ఒక విషయాన్ని మరిచిపోతున్నారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. వైసీపీ, టీడీపీలతో తలపడే అభ్యర్థులను ఇంతవరకు పార్టీ తయారుచేసుకోలేదని, అంతేకాకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేయలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

అంగబలం, అర్థబలం రెండూ ఉండాలి..

అంగబలం, అర్థబలం రెండూ ఉండాలి..


ఆ రెండు పార్టీల అభ్యర్థులతో తలపడాలంటే అంగబలం, అర్థబలం రెండు ఉండాలి. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తినివుండాలి. కానీ అలాంటివేమీ లేకుండా, నాయకులు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి అవుతానని, సంతకం పెడతానని అనడాన్ని విమర్శకులు తప్పు పడుతున్నారు. ప్రజల్ని ఓట్లు వేయడానికి అనుకూలంగా మలచుకోవాలని, లేదంటే ఈవీఎంలు ఓట్లు వేస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేసుకోవాలని, ప్రధానమంత్రి, బీజేపీ అండగా ఉంటానని చెప్పినప్పటికీ అది అభ్యర్థులను గెలిపిస్తుందా? అధికారాన్ని తెచ్చిపెడుతుందా? అనేది ఒకసారి పవన్ కల్యాణ్ ప్రశ్నించుకోవాలని విశ్లేషకుల నుంచి సూచనలు వస్తున్నాయి. మరి పవన్ ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.!

English summary
It is known that Janasena leader Pawan Kalyan is lashing out saying that he will end the anarchic rule of YCP, he will not let the anti-government vote split, they are all corrupt and are acting like goons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X