వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్‌ హ‌రి చంద‌న్‌: తెలంగాణ‌కు న‌ర‌సింహ‌న్ : నియామ‌కం వెనుక వ్యూహం.

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా ఊహిస్తున్న‌ట్లుగానే ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న న‌ర‌సింహ‌న్‌ను తెలంగాణ‌కు ప‌రిమితం చేసారు. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్ నియ‌మితులయ్యా రు. ఈ మేర‌కు రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు జారీ చేసారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 2014 వ‌ర‌కు ఏపీ..తెలంగాణ‌కు ఉమ్మ డి గ‌వ‌ర్న‌ర్ ఉండాల్సి ఉంది. అయితే, ఇప్ప‌టికే ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం ఏపీ లో అమ‌రావ‌తి రాజ‌ధాని కేంద్రంగా పాల‌న సాగిస్తున్న ప‌రిస్థితుల్లో..ఉమ్మ‌డి రాజ‌ధాని కాకుండా ఎవ‌రి పాల‌న వారు కొన‌సాగిస్తుండ‌టంతో పాటుగా.. భ‌విష్య త్ వ్యూహాల్లో భాగంగా ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌య్యారు.

Recommended Video

జగన్ చేసిన వ్యాఖ్యలకు అచ్చెంనాయుడు రివర్స్ కౌంటర్
ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్‌ హ‌రి చంద‌న్‌: తెలంగాణ‌కు న‌ర‌సింహ‌న్ : నియామ‌కం వెనుక వ్యూహం..!

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత కొద్ది రోజులుగా కేంద్రం కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మిస్తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది . అనేక పేర్లు తెర మీద‌కు వ‌చ్చాయి. అయితే, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం 2024 వ‌ర‌కు ఏపీ-తెలంగాణ కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఉండాల్సి ఉంది. అయితే, ఇప్ప‌టికే ఉమ్మ‌డి రాజ‌ధాని కాద‌ని ఎవ‌రి పాల‌న వారు త‌మ రాజ‌ధానుల్లో కొన‌సాగి స్తున్న ప‌రిస్థితుల్లో దీని పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తోనూ కేంద్రం సంప్ర‌దింపులు జ‌రిపింది. అందులో భాగంగా ఈ మ‌ధ్య న‌ర‌సింహ‌న్ స్వ‌యంగా విజ‌య‌వాడ వ‌చ్చి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో క‌లిసారు. తాను కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర ను ప‌రిమితం అవుతున్న‌ట్లుగా చెప్పిన‌ట్లు అప్ప‌ట్లోనే ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు న‌ర‌సింహ‌న్‌ను తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసారు. ఏపీకి తొలి గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్‌ను నియ‌మిస్తూ రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు జారీ చేసారు.

ఒడిశా స్వ‌రాష్ట్రం..జ‌న‌సంఘ్ కార్య‌క‌ర్త‌గా

ఒడిశా స్వ‌రాష్ట్రం..జ‌న‌సంఘ్ కార్య‌క‌ర్త‌గా

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఒడిశా రాష్ట్రంకు చెందిన వారు. ఆయ‌న 1934 ఆగ‌స్టు 3వ తేదీన జ‌న్మించారు. న్యాయ‌వాద వృత్తిలో ప‌ట్ట‌భ‌ద్రుడైన బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ మంచి ర‌చ‌యిత. ఆయ‌న అనేక ర‌చ‌న‌లు చేసారు. ఇక‌, యువ‌కుడిగా ఉన్న స‌మయం నుండి జ‌న‌సంఘ్..ఆర్‌య‌స్‌య‌స్‌ కార్య‌క‌ర్త‌గా ఉన్నారు. ఆ త‌రువాత బీజేపీలో ప‌ని చేసారు. అక్క‌డ నుండి కొన్ని కార‌ణాల వ‌ల‌న బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌తాద‌ళ్‌లో కీల‌క పాత్ర పోషించారు. కొద్ది కాలాని కి తిరిగి బీజేపీలో చేరారు. ఆయ‌న ఒడిశాలో అయిదు సార్లు ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు. ఆ రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి గానూ ప్రాతినిధ్యం వ‌హించారు. 1980 నుండి 1988 వ‌ర‌కు ఒడిశా బీజేపీ రాష్ట్ర శాఖ‌కు బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఉపాధ్య‌క్షుడిగా..అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. ఆ త‌రువాత బీజేపీ జాతీయ వ్య‌వ‌హారాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దశ్ తొలి గవర్నరుగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.

అమిత్ షా చాయిల్ ప్ర‌కారం..

అమిత్ షా చాయిల్ ప్ర‌కారం..

భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని ఏపీకి గ‌వ‌ర్న‌ర్ ఎంపిక చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. సుదీర్ఘంగా ఆరు ద‌శాబ్దాల‌కు పైగా బీజేపీతో అనుబంధం ఉన్న బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్‌ను ఏపీకి గ‌వర్న‌ర్‌గా ఖ‌రారు చేసారు. దీని ద్వారా రానున్న రోజుల్లో బీజేపీ ఏపీ మీద ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌నుంద‌నే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇక‌, కొత్త గ‌వ‌ర్న‌ర్ స‌మాచారం ముందుగానే అంద‌టంతో ఏపీ ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌లోనే తాత్కాలిక రాజ్ భ‌వ‌న్‌ను సిద్దం చేసింది. గ‌తంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వినియోగించిన బంద‌రు రోడ్డులోని ఇరిగేష‌న్ కార్యాల‌యాన్ని తాత్కాలికంగా రాజ్ భ‌వ‌న్‌గా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెలాఖ‌రులోగా కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని స‌మాచారం.

English summary
President appointed Biswa Bhushan Hari Chandan as new Governor of AP. Present Governor Narasimhan continue for only telangana. New Governor previously worked in Odissa BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X