విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాంతి మన లక్ష్యం: ప్రణబ్, ఐఎఫ్‌ఆర్‌లో అలరించిన యుద్ధ విన్యాసాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సముద్రతలంపై శాంతిని నెలకొల్పడంలో నావికాదళానిదే కీలకపాత్ర అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ‘మనమంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరత, పరస్పర సహకారం కోసం అన్ని దేశాల నౌకాదళాలు కదలి రావాలి' అని త్రివిధ దళాధిపతి, భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ప్రధాన ఘట్టమైన ఫ్లీట్ రివ్యూ శనివారం విశాఖ తీరంలో జరిగింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ప్రణబ్ ముఖర్జీ దేశ, విదేశీ యుద్ధ నౌకలను సమీక్షించారు. యుద్ధ విమాన విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంతోపాటు, భారతదేశంపై తమకున్న దేశభక్తికి చిహ్నంగా ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నామన్నారు.

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని నిర్వహించడం ద్వారా వివిధ దేశాలతో తమ బంధం మరింత బలపడిందన్నారు. వివిధ దేశాల నౌకదళ శౌర్య పరాక్రమాలను ఒకేచోట ప్రదర్శించేందుకు ఫ్లీట్ రివ్యూ వేదికైందన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

సముద్రతలంపై శాంతిని నెలకొల్పడంలో నావికాదళానిదే కీలకపాత్ర అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

‘మనమంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరత, పరస్పర సహకారం కోసం అన్ని దేశాల నౌకాదళాలు కదలి రావాలి' అని త్రివిధ దళాధిపతి, భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ప్రధాన ఘట్టమైన ఫ్లీట్ రివ్యూ శనివారం విశాఖ తీరంలో జరిగింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ప్రణబ్ ముఖర్జీ దేశ, విదేశీ యుద్ధ నౌకలను సమీక్షించారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

యుద్ధ విమాన విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంతోపాటు, భారతదేశంపై తమకున్న దేశభక్తికి చిహ్నంగా ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నామన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని నిర్వహించడం ద్వారా వివిధ దేశాలతో తమ బంధం మరింత బలపడిందన్నారు. వివిధ దేశాల నౌకదళ శౌర్య పరాక్రమాలను ఒకేచోట ప్రదర్శించేందుకు ఫ్లీట్ రివ్యూ వేదికైందన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

‘వివిధ దేశాల నౌకాదళాలు ఒకేచోటికి చేరాయి. సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరత కాపాడాలన్నది మన అందరి లక్ష్యం. పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నౌకాయానం మరింత బలపడేందుకు మనందరం భాగస్వాములం కావాలని రాష్టప్రతి పిలుపునిచ్చారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

అనేక దేశాల నౌకాదళాలు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనడం ద్వారా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ స్ఫూర్తిని మరింత పెంచాయన్నారు. భౌగోళికంగా విడిపోయినా, సముద్రపరంగా మనమంతా కలిసే ఉన్నాం' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఇంటర్నేషల్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలకు విలువైన సందేశం ఇవ్వబోతోందన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

మానవత్వాన్ని పెంపొందించేందుకు ఒకరికొకరం చేతులు కలిపేందుకు ఈ ఫ్లీట్ రివ్యూ దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ప్రణబ్ వ్యక్తం చేశారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ప్రపంచ దేశాల్లోని నేవీలు తమ ప్రతిష్ఠను పెంచుకుంటూనే, సముద్ర జలాల్లో ప్రశాంతత పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమ తమ దేశాల్లో భారత దేశం ఆకాంక్షిస్తున్న శాంతి, సుస్థిరతలను వివరించే అంబాసిడర్‌లుగా వ్యవహరించాలని కోరారు. మీరందిస్తున్న స్నేహ హస్తాన్ని అందిపుచ్చుకుని భద్రత, రక్షణ, శాంతిని నలుదిశలా విస్తరించడానికి భారతదేశం కృషి చేస్తుందని ప్రకటించారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

గత రెండు రోజులుగా మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు. ఇది మంచి అనుభూతిగా భావించి, భవిష్యత్‌లోనూ కలిసి పనిచేయడానికి సహకారించాలని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

సువిశాలమైన హిందూ మహాసముద్రంలో సముద్ర రవాణాలో కీలక భూమిక పోషిస్తోందని ప్రణబ్ అన్నారు. ప్రపంచీకరణ, ఆర్థికాభివృద్ధి, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సముద్ర జలాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఇందుకు అనుగుణంగా భారత నౌకాదళం మారిటైం వ్యూహాన్ని మార్చుకుంటోందని చెప్పారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని ఇంత అద్భుతంగా, కచ్చితమైన ప్రణాళికతో నిర్వహించిన భారత నౌకాదళాన్ని ప్రణబ్ అభినందించారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

నేవీకి విశాఖ ప్రజలు మంచి సహకారాన్ని అందించడం వలన కార్యక్రమం ఇంతగా విజయవంతమైందన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, విశాఖ నగర ప్రజలకు ప్రణబ్ అభినందనలు తెలియచేశారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

వివిధ దేశాల నుంచి తరలి వచ్చిన విదేశీ అతిథులు తిరిగి వెళుతూ మంచి అనుభూతులను తీసుకువెళతారన్న నమ్మకం తనకు ఉందన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

భారత సంస్కృతి, సంప్రదాయాలతోపాటు, ప్రపంచ శాంతి కోసం భారత్ చేస్తున్న కృషి గురించి తమ దేశాల్లో చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా స్నేహబంధం మరింత బలపడటంతోపాటు, భవిష్యత్‌లో మెరుగైన సముద్రయానానికి మార్గం సుగమవుతుందని ప్రణబ్ పేర్కొన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ప్రణబ్ తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అక్కడికి చేరుకున్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

వీరితోపాటు భారత నౌకాదళ అధిపతి ఆర్‌కె ధావన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రహా, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి సతీష్ సోనీ, దక్షిణ నౌకాదళ అధికారి గిరీష్ లోద్ర, పశ్చిమ నౌకాదళ అధికారి సునీల్ లాంబ, అండమాన్ నికోబార్ నౌకాదళ అధికారి ప్రదీప్ కుమార్ చటర్జీ సిద్ధంగా ఉన్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

8.50 గంటల సమయంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధ నౌకపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై ఆశీనులయ్యారు. ఆయనకు ఇరుపక్కల ప్రధాని, రక్షణ మంత్రులు కూర్చున్నారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

తొమ్మిది గంటలకు యుద్ధనౌకల సమీక్షకు ‘సుమిత్ర' ఠీవిగా బయల్దేరింది. ఆ నౌకను ఐఎన్‌ఎస్ సుమేథ, ఐఎన్‌ఎస్ సునయన, ఐఎన్‌ఎస్ సరయు అనుసరించాయి.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

ఆరు వరుసల్లో బారులు తీరిన యుద్ధ నౌకలు, కోస్ట్‌గార్డ్ నౌకలు, శిక్షణ నౌకలు, వాణిజ్య నౌకలను రాష్టప్రతి సమీక్షించారు. ఈ నౌకల మధ్య నుంచి అధ్యక్షుని నౌక పయనించింది.

ఎఫ్‌ఆర్

ఎఫ్‌ఆర్

ఒక్కో నౌకను దాటుతున్నప్పుడు ఆయా నౌకలపై ఉన్న నావికాదళ సిబ్బంది తమ టోపీలను తీసి వృత్తాకారంగా తిప్పుతూ మూడుసార్లు జై..జై..జై..అంటూ నినాదాలు చేశారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

రాష్టప్రతి వీరికి శెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. 2006 సంవత్సరంలో విశాఖలో జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో అప్పటి రాష్టప్రతి అద్బుల్ కలాం ఈ గౌరవాన్ని పొందారు.

ఐఎఫ్‌ఆర్

ఐఎఫ్‌ఆర్

అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఇప్పుడు రాష్టప్రతి, సర్వసైన్యాధ్యక్షుని హోదాలో ఇదే తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం గమనార్హం.

English summary
As India projected its naval might along the eastern seaboard with nearly 75 Indian warships participating in the International Fleet Review (IFR) 2016, President Pranab Mukherjee on Saturday called for using the seas to promote peace, cooperation and friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X