వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల, తిరుపతిలో హైఅలెర్ట్ -ముందుగానే సీఎం జగన్, గవర్నర్ -రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబ సమేతంగా వస్తోన్న రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లు రేణిగుంట ఎయిర్ పోర్టులో స్వాగతం పలకనున్నారు. కోవింద్ తో కలిసి గవర్నర్, సీఎం కూడా తిరుమలను సందర్శించనున్నారు.

చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రంచంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

అంతా సిద్ధమన్న టీటీడీ

అంతా సిద్ధమన్న టీటీడీ

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో హైఅర్ట్ ప్రకటించారు. ఏపీ పోలీసులు, కేంద్ర బలగాలు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రేపు రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా కూడా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు చేయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

చైనా బరితెగింపు:యుద్ధానికి వీలుగా సరిహద్దులో కొత్త ఆర్మీ కంటోన్మెంట్లు -శాటిలైట్ చిత్రాల్లో బట్టబయలుచైనా బరితెగింపు:యుద్ధానికి వీలుగా సరిహద్దులో కొత్త ఆర్మీ కంటోన్మెంట్లు -శాటిలైట్ చిత్రాల్లో బట్టబయలు

ఇదీ ప్రెసిడెంట్ షెడ్యూల్..

ఇదీ ప్రెసిడెంట్ షెడ్యూల్..

మంగళవారం (నవంబర్ 24)న ఉదయం 6గంటలకు రాష్ట్రపతి కోవింద్ తన కుటుంబంతో కలిసి రాష్ట్రపతి భవన్‌(ఢిల్లీ) నుంచి బయలుదేరనున్నారు. 6:15 గంటలకు పాలం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి 9:15 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకోనున్నారు. 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి 11 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత 12:15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహంలో దిగుతారు. తర్వాత..

Recommended Video

AP CM YS Jagan ఇంటి ముందు భజరంగ్ దల్ నిరసన, అరెస్ట్
నివర్ తుఫాను గండం..

నివర్ తుఫాను గండం..

మధ్యాహ్నం 12:50 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహంలో విడిది చేసి అక్కడి నుంచి వరాహస్వామి ఆలయాన్ని రాష్ట్రపతి కుటుంబం సందర్శించనున్నారు. 1:05 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రపతి 1: 40 గంటలకు తిరిగి పద్మావతి అతిధి గృహం చేరు​కోనున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత విరామం తీసుకున్న అనంతరం 3:40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, బంగాళాఖాతంలో తలెత్తిన నివర్ తుఫాను మంగళవారమే తీరం దాటనుండటం, రాయలసీమ జిల్లాల్లోనూ దాని ప్రభావం ఉండటంతో అధికారులు అన్ని రకాలుగా అప్రమత్తం అయ్యారు.

English summary
President Ramnath Kovind accompanied by his family members will arrive at Tirumala on Tuesday for the darshan of Lord Venkateswara. The President will be spending about three hours here during his entire six-hour trip. Governor Biswa Bhusan Harichandan and Chief Minister Y.S. Jagan Mohan Reddy will receive the President at the airport and accompany him on his pilgrimage. Best of arrangements in place for President Ram Nath Kovind's visit to Tirupati says TTD chairman YV Subba Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X