వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికలు: చెల్లుబాటుకాని ఓట్లు 77, ఏపీలో మూడు

రాష్ర్టపతి ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 77 ఓట్లు చెల్లలేదు. ఎంఏల్ఏలు, ఎంపిలు కొందరు ఓటు వేసే సమయంలో చేసిన పొరపాటు కారణంగా ఈ ఓట్లు చెల్లలేదు. మరోవైపు ఏపీ రాష్ట్రంలో మూడు ఓట్లు చెల్లలేదు. తెలం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:రాష్ర్టపతి ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 77 ఓట్లు చెల్లలేదు. ఎంఏల్ఏలు, ఎంపిలు కొందరు ఓటు వేసే సమయంలో చేసిన పొరపాటు కారణంగా ఈ ఓట్లు చెల్లలేదు. మరోవైపు ఏపీ రాష్ట్రంలో మూడు ఓట్లు చెల్లలేదు. తెలంగాణలో మాత్రం అన్ని ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.కోవింద్:

అవమానం జరిగిన చోటే రాచమర్యాద, ఐఎఎస్ కావాలనుకొని రాష్ట్రపతిగాఅవమానం జరిగిన చోటే రాచమర్యాద, ఐఎఎస్ కావాలనుకొని రాష్ట్రపతిగా

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో కోవింద్‌కు 2,930 ఓట్లు (వాటి విలువ 7,02,044)పోలయ్యాయి.యూపిఏ అభ్యర్థి మీరాకుమార్‌కు 1844 ఓట్లు( వాటి విలువ 3,67, 314) పోలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో 77 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

 Presidential election 2017: Out of 77 invalid votes, MPs had cast 21

అయితే ఏపీ రాష్ట్రం నుండి పోలైన ఓట్లలో మూడు ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఏపీ రాష్ట్రంలోని అధికార టిడిపి, విపక్ష వైసీపీలు కూడ ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాద్ కోవింద్‌కు మద్దతును ప్రకటించాయి.

ఈ నెల 17న, జరిగిన పోలింగ్‌కు ముందు టిడిపి ప్రజాప్రతినిధులకు మాక్ పోలింగ్ నిర్వహించి ఓటు ఎలా వేయాలనే విషయమై శిక్షణ ఇచ్చారు.వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ చీఫ్ జగన్ వెంట వచ్చి మరీ ఓటు వేశారు.

అయితే ఈ ఎన్నికల్లో మూడు ఓట్లు ఏపీ రాష్ట్రం నుండి చెల్లుబాటు కాలేదు .ఏపీలో రామ్‌నాద్ కోవింద్‌కు 27,189 ఓట్లు దక్కాయి.కానీ, మీరాకుమార్‌కు ఒక్క ఓటుకూడ దక్కలేదు. తెలంగాణలో 12,804 ఓట్లు కోవింద్‌కు దక్కాయి. కానీ, అన్ని ఓట్లు చెల్లుబాటయ్యాయి.

ఏపీలో చెల్లుబాటు కాని మూడు ఓట్లలో రెండు టిడిపి ఎమ్మెల్యేలకు చెందినవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరో ఓటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఓటుగా తెలుస్తోంది.

పోలింగ్ రోజున టిడిపికి చెందిన గుత్తి ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ బ్యాలెట్ పేపర్‌పై కోవింద్‌ పేరుకు ఎదురుగా ఉన్న 1 అంకె వేశాడు.అంతేకాదు బ్యాలెట్ పేపర్‌పై తన పేరును రాశాడు.

మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడ బ్యాలెట్ పేపర్‌పై కూడ ఆయన తన పేరు రాశాడు. దీంతో ఈ ఓటు కూడ చెల్లుబాటు కాకుండా పోయిందని సమాచారం. అయితే వైసీపీ ఎమ్మెల్యే కూడ బ్యాలెట్ పేపర్‌పై అంకెకు బదులుగా టిక్ మార్క్ చేశాడు. దీంతో ఈ ఓటు కూడ చెల్లుబాటు కాకుండా పోయింది.

చెల్లుబాటు కాని 77 ఓట్లలో 21 మంది ఎంపిలు కూడ పొరపాటుగా ఓటు చేశారు. బెంగాల్ నుండి పది మంది, ఢిల్లీ నుండి ఆరుగురు, మణిపూర్ , ఝార్ఖండ్ , ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుండి నాలుగు ఓట్లు చెల్లకుండాపోయాయి.

English summary
A total of 77 votes were declared invalid today during counting for the presidential election and the list of rejected ballots was topped by parliamentarians. According to data provided by the returning officer, a total of 77 votes were found to be invalid. Twenty one votes cast by members of parliament were among the votes found invalid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X