వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు దూరం చేసేందుకే మద్యం ధరల పెంపు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ మద్యం దుకాణాలను వ్యతిరేకిస్తూ కొంతమంది వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా ఆందోళన చేస్తున్నారని డిప్యూటి సిఎం నారాయణ స్వామి అన్నారు. వద్దనుకునే వారు గ్రామంలోని అందరు కలిసి ప్రభత్వానికి తెలపాలని అన్నారు. మద్యం అమ్మకాలను పకడ్బందిగా చేపడతామని చెప్పారు. అన్ని వైన్ షాపుల ముందు మద్యం రేట్లను డిస్‌ప్లే చేస్తామని అన్నారు. ఇక బెల్టుషాపులపై కూడ ఉక్కుపాదం మోపుతామని అయన చెప్పారు. మద్యం విక్రయాలు రాత్రి ఎనమిది గంటల వరకే కొనసాగుతాయని చెప్పిన ఆయన దీన్ని ఆసరా చేసుకుని నాటు సారా అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మందుబాబులకు షాక్: భారీగా మద్యం ధరలు పెంపు: బార్ల వేళలు కుదింపు..!మందుబాబులకు షాక్: భారీగా మద్యం ధరలు పెంపు: బార్ల వేళలు కుదింపు..!

మరోవైపు మద్యం ధరలను పెంచడం పై ఆయన వివరణ ఇచ్చారు. బీదవారికి మద్యం అందుబాటులో లేకుండా చేసేందుకే మద్యం ధరలు పెంచుతున్నామని చెప్పిన ఆయన దీని వల్ల బీదల్లో మార్పు కనిపించే అవకాశం ఉందని అన్నారు. ధరల పెరుగుదల బీదవారిని దూరంగా ఉంచడం మినహ ప్రభుత్వానికి ఇతర ఆలోచన లేదని చెప్పారు. ఇక విషయంలో కూడ మరో పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

 price hikes to avoid People from Alcohol : Dy CM NarayanaSwamy

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభమయ్యాయి. ఉదయం పదకొండు గంటల నుండి రాత్రీ ఎనిమిది గంటల వరకు మద్యం షాపులు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముప్పై అయిదు వందల దుకాణాల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రతి దుకాణంలో ఒక సూపర్‌వైజర్‌తో పాటు ముగ్గురు సేల్స్‌మెన్‌లను నియమించింది. గ్రామాల్లో మాత్రం ఒక సూపర్‌వైజర్‌తో పాటు ఇద్దరు సేల్స్‌మెన్స్‌ కొనసాగనున్నారు.

English summary
AP Deputy CM Narayana Swamy said that some people are deliberately agitating against the government liquor stores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X