విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త హత్య కేసులో సరస్వతి స్కెచ్ మామూలుగా లేదు: విచారణలో ప్రియుడు శివ

|
Google Oneindia TeluguNews

విజయనగరం: భర్తను ప్రియుడి సహాయంతో హత్య చేయించిన కేసులో మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సరస్వతి ప్రియుడు మడ్డు శివ అలియాస్‌ ఆది పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించినట్లు సమాచారం.

Recommended Video

ప్రియుడి కోసం.. భర్తను హత్యచేయించిన నవవధువు

ఎస్పీ పాలరాజు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఈ హత్య కేసుకు సంబంధించిన కీలక వెల్లడించారు. మే 7న గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు సమీపంలో నవ వరుడు గౌరీశంకర్‌ హత్యకు గురయ్యాడు. ఇందులో ఆయన భార్య సరస్వతితో పాటు విశాఖపట్నంకు చెందిన మరో నలుగురి (సుపారి గ్యాంగ్‌)ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రధాన సూత్రధారి శివ

ప్రధాన సూత్రధారి శివ

తాజాగా ప్రధాన నిందితుడు సరస్వతి ప్రియుడు శివను కూడా అరెస్టు చేశారు. విజయవాడలో తలదాచుకున్న ఇతడ్ని మరో చోటికి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉంటుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు శివ హత్యకు సంబంధించిన కీలక విషయాలను తెలిపాడు.

భర్తను చంపించిన భార్య: సరస్వతి ప్రియుడు శివ అరెస్ట్, కేసులో మరో షాకింగ్ ట్విస్ట్! భర్తను చంపించిన భార్య: సరస్వతి ప్రియుడు శివ అరెస్ట్, కేసులో మరో షాకింగ్ ట్విస్ట్!

లేచిపోవాలనుకున్నారు కానీ..

లేచిపోవాలనుకున్నారు కానీ..

లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్లకు దూరమైపోతాం..పైగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని, గౌరీశంకర్‌నే అడ్డు తొలగిస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నారు సరస్వతి, ఆమె ప్రియుడు శివ. సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపి మనమే చంపించేసి ఆ నెపం దారి దోపిడీ దొంగలపై తోసేస్తే అందరూ నమ్మేస్తారని అనుకున్నారు. అందుకు అనువైన ప్రదేశం తోటపల్లి జలాశయానికి వెళ్లే నిర్మానుష్య ప్రాంతమైతే బాగుంటుందనుకున్నారు.

మహానుభావుడిలా వచ్చి పెళ్లాడమని..

మహానుభావుడిలా వచ్చి పెళ్లాడమని..

‘హత్య అనంతరం కొద్ది రోజుల తరువాత మానవతా హృదయంతో వితంతువును వివాహమాడటానికి మా ఇంటికి వస్తావు. ఇంట్లో వారిని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పిస్తావు, పైగా ఇద్దరిది ఒకే కులం కాబట్టి, బాధల్లో ఉన్నందున అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు' అని సరస్వతి ప్రియుడికు వివరించిందని ఎస్పీ తెలిపారు.

బెంగళూరులోనే భర్త హత్యకు ప్లాన్ కానీ..

బెంగళూరులోనే భర్త హత్యకు ప్లాన్ కానీ..


వాస్తవానికి గౌరీశంకర్‌ను బెంగుళూరులో ఉంటుండగానే చంపేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడైతే ఎవరికీ ఎటువంటి అనుమానం రాదన్న ఆలోచనతో బెంగుళూరులో ఒక ముఠాకు రూ.25 వేలు డబ్బులు అడ్వాన్సుగా ఇచ్చారు. అయితే హంతక ముఠా చంపడం దేనికని, మీరిద్దరూ పారిపోయి వెళ్లి పోతే సరిపోతుంది కదా అని చెప్పినా సరస్వతి, శివ అందుకు అంగీకరించలేదు. మీ వల్ల కాకపోతే చెప్పండి.. వేరే వాళ్లతో మాట్లాడుకుంటామని అనడంతో సరేనని ఒప్పుకున్నారు. బెంగుళూరులో హత్య చేద్దామని ప్రయత్నించినా కుదరకపోవడంతో శ్రీకాకుళంగాని, విజయనగరంలోగాని లేపేస్తామని ముఠా హామీ ఇచ్చింది. తీరా వాళ్లు వారి ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసేయడంతో, విశాఖపట్నంలో మరో గ్యాంగ్‌ను కలిసి వారితో పథకాన్ని అమలు చేయించారు.

శివను ప్రేమించి.. శంకర్‌ను పెళ్లాడి..

శివను ప్రేమించి.. శంకర్‌ను పెళ్లాడి..

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన సరస్వతి విద్యాభ్యాసం (బీఎస్సీ) నిమిత్తం 2016లో విశాఖపట్నం వెళ్లింది. అక్కడ రోలుగుంటకు చెందిన ఫొటోగ్రాఫర్‌ మడ్డు శివతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి తిరిగారు. అయితే, ఇంతలో సరస్వతికి తన గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయిన యామక గౌరీశంకర్‌తో పెళ్లి ఖాయమైంది. ఈయన కర్నాటకలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గౌరీశంకర్‌ను పెళ్లి చేసుకోవడం సరస్వతికి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామంటే వద్దని, తనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. హత్యకు పథకాన్ని రచించి వివరించింది. దాని అమలుకు ఆర్థికపరమైన సాయంతో పాటు నేర చరిత్ర ఉన్న వారితో మాట్లాడే బాధ్యత శివ తీసుకున్నాడు. గతంలో మరొక అమ్మాయిని ప్రేమించిన శివ ఆమెను ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు చూపించగా, వాళ్లు మందలించడంతో ఆమెను వదిలేశాడు. ఆ తరువాత సరస్వతితో ప్రేమాయణం సాగించాడు.

లోతుగా దర్యాప్తు

లోతుగా దర్యాప్తు

గౌరీశంకర్‌ను హత్య చేయడానికి వారం రోజుల ముందే శివ పార్వతీపురం చేరుకున్నాడు. గుమ్మలక్ష్మిపురంలో వివాహం ఉందని, వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బయలుదేరి వచ్చేశాడు. సుపారీ గ్యాంగ్‌తో ఎప్పటికప్పుడు హత్యకు సంబంధించిన పథకాన్ని వివరిస్తూ వచ్చాడు. మే 7న రాత్రి గౌరీశంకర్‌ని మరికొద్దిసేపట్ల హత్య చేస్తారనగా పార్వతీపురం నుంచి బయలుదేరి అనకాపల్లి వెళ్లిపోయాడని ఎస్పీ వివరించారు. కాగా, మరింత లోతుగా విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, అందరినీ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ పి.సౌమ్యలత, సీఐలు రాంబాబు, రామకృష్ణ, మోహన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

English summary
Vizianagaram police on Sunday arrested main accused M Shiva in the sensational murder case reported at ITDA park of Garugubilli mandal recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X