వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు మోదీ..షా బంప‌రాఫ‌ర్ : ఏపీ సీఎం అంగీక‌రిస్తారా : ఎవ‌రికి ద‌క్కేను ఆ ఛాన్స్..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ వైసీపీకి బంప‌రాఫ‌ర్ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వంలో చేర‌టానికి..ఎన్డీఏలో భాగ‌స్వామిగా ఉండ‌టానికి జ‌గ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా చంద్ర‌బాబును ఘోరంగా ఓడించి.. ఒంటి చేత్తో ఏక‌ప‌క్ష విజ‌యం సాధించిన జ‌గ‌న్ పై ప్ర‌ధాని మోదీ అప్యాయ‌త చూపిస్తున్నారు. తామిద్ద‌రం క‌లిసి ఏపీని అత్యున్నత స్థానాల‌కు తీసుకొని వెళ్తామ‌ని మోదీ స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని..బీజేపీ జాతీయాధ్య‌క్షుడు నుండి ఇప్పుడు వైసీసీకి ఒక బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రి..జ‌గ‌న్ ఏ విధంగా స్పందిస్తారు..

 లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్‌గా...

లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్‌గా...

లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం బీజేపీ అతి పెద్ద పార్టీగా..అధికారంలో ఉంది. లోక్‌స‌భ స్పీక‌ర్‌గా అధికార పార్టీకి చెందిన వారికే అవ‌కాశం ద‌క్కుతుంది. గ‌త స‌భ‌లో మ‌హిళా స్పీక‌ర్‌గా సుమిత్ర మ‌హాజ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇప్పుడు ఈ సారి స‌భ‌లో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందో ఇంకా బీజేపీ అధినాయ‌క‌త్వం ప్ర‌క‌టించ లేదు. ఇదే స‌మ‌యంలో డిప్యూటీ స్పీక‌ర్ గురించి చ‌ర్చ మొద‌లైంది. సాధార‌ణంగా లోక్‌స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కేటాయిస్తారు. గ‌త స‌భ‌లో అన్నా డీఎంకేకు చెందిన తంబొదొరైకు అవ‌కాశం ద‌క్కింది. ఈ సారి స‌భ‌లో బీజేపీ, కాంగ్రెస్,డీఎంకే త‌రువాత వైసీపీ సంఖ్య ప‌రంగా స‌భ‌లో పెద్ద పార్టీ. కాంగ్రెస్, డీఎంకే రెండు పార్టీల‌కు కాకుండా..డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి వైసీపీకి ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు బీజేపీ అధినాయ‌క‌త్వం నుండి ముక్య‌మంత్రి జ‌గ‌న్‌కు స‌మాచారం అందించారు.

జ‌గ‌న్ అంగీక‌రిస్తారా...

జ‌గ‌న్ అంగీక‌రిస్తారా...


ఇప్పుడు స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ..బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి వైసీపీకి ఇవ్వా లని భావిస్తున్నామ‌ని స‌మాచారం అందించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ తాను పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యం చెబుతాన‌ని స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పార్టీ ముఖ్యులు విజ‌య సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వేంక‌టేశ్వ‌ర్లు, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డితో స‌హా..తాజాగా పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా నియ‌మితులైన మిధున్ రెడ్డితో జ‌గ‌న్ చ‌ర్చించన్నారు. అయితే, ఈ పోస్టు స్వీక‌రించ‌టం ద్వారా రాజ‌కీయంగా ఎదుర‌య్యే లాభ న‌ష్టాల గురించి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్..ఢిల్లీ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంలో చేరే అంశం పైన ప్ర‌తిపాద‌న వ‌చ్చిన సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఇది కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ద‌వి కాక‌పోవ టం..అదే స‌మ‌యంలో లోక్‌స‌భ‌లో గుర్తింపు ఇచ్చే ప‌ద‌వి కావ‌టంతో ఆమోదించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కేను..

ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కేను..

వైసీపీకి లోక్‌స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే..పార్టీ నుండి ఉన్న 22 మంది ఎంపీల్లో ఎవ‌రికి ఆ అవ‌కాశం ఇస్తారనే చ‌ర్చ మొద‌లైంది. త‌న కేబినెట్ కూర్పులో ప‌క్కా సామాజిక స‌మీక‌ర‌ణాలు పాటించిన జ‌గ‌న్‌..ఇప్పుడు జాతీయ స్థాయి లో త‌మ పార్టీకి ద‌క్కే ప‌ద‌వి ఏ వ‌ర్గానికి ఇస్తార‌నే దాని పైన ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఒకే ప‌ద‌వి దక్క‌నుండ‌టంతో జ‌గ‌న్ ఎస్సీ లేదా ఎస్టీ వ‌ర్గాల‌కు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెడుతార‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పార్టీ పార్ల‌మెంట‌రీ నేత‌గా విజ‌య సాయిరెడ్డి..లోక్‌స‌భ ఫ్లోర్ లీడ‌ర్‌గా మిధున్ రెడ్డి..విప్‌గా బీసీ వ‌ర్గానికి చెందిన భ‌ర‌త్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ద‌క్కితే అక్క‌డ తొలుత స్పీక‌ర్‌గా ఏ వ‌ర్గానికి ఇస్తార‌నే దానికి అనుగుణంగా ఇక్క‌డి సామాజిక వ‌ర్గాన్ని ఖ‌రారు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం మేర‌కు ఎస్టీ వ‌ర్గానికి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. వైసీపీ నుండి అర‌కు ఎంపీగా గెలిచిన గొడ్డేటి మాధ‌వి ఈ ప‌ద‌విని ద‌క్కించుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

English summary
Prime Minister Modi and BJP Chief Amith Shah offered YCP for Deputy Speaker in Loksabha. Already negotiation start with YCP leaders. If Jagan accept for this offer ycp get key post in Loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X