వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీ

|
Google Oneindia TeluguNews

ఏపి డిప్యూటీ సీఎం , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్న ఆయన ఏపీలో కరోనా నివారణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు అని పేర్కొన్నారు. ఎక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందో అని చంద్రబాబు, లోకేష్ లు ఆందోళన చెందుతున్నారని ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు.

టీడీపీ నాయకుల కార్ఖానా .. ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగంటీడీపీ నాయకుల కార్ఖానా .. ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగం

 ప్రతిపక్ష నేత అయ్యుండి బాధ్యతా రహితంగా చంద్రబాబు

ప్రతిపక్ష నేత అయ్యుండి బాధ్యతా రహితంగా చంద్రబాబు

ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణా చర్యలపై కూడా విమర్శలు చేస్తూ సజావుగా సాగే పాలనను అడ్డుకోవాలని చూస్తున్న చంద్రబాబు, ప్రతిపక్షనేత అయ్యుండి కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలు అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

 ప్రజలు కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు .. సమస్య ఒక్క బాబుకే

ప్రజలు కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు .. సమస్య ఒక్క బాబుకే

చంద్రబాబుకు ఇలా అబద్దాలు చెప్పుకోవడం అలవాటైపోయింది అని, ప్రజలంతా కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటుంటే ఆయన జూమ్ లో సందేశాలు ఇస్తూ ప్రజలకు కరోనా కష్టాలు అంటూ వాపోతున్నారని మండిపడ్డారు ఆళ్ల నాని. రాష్ట్రంలో కరోనా పైన మాత్రమే కాకుండా, వైద్య ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్లిపోయారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ మేనిఫెస్టోలో హామీలు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

ఏపీలోని గ్రామ సచివాలయాల విషయంలో మోడీ దృష్టి

ఏపీలోని గ్రామ సచివాలయాల విషయంలో మోడీ దృష్టి

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏడాది కాలంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆళ్ళ నానీ. కోర్టులలో కేసులు వేయించటం, ప్రభుత్వంపై బురద చల్లటం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఏపీలో కరోనా నివారణ చర్యలను కొనియాడుతూ ఉంటే చంద్రబాబు మాత్రం కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని గ్రామ సచివాలయాలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరడం గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు.

Recommended Video

India-China Stand Off : China కు భారత్ షాక్.. LAC పై డ్రాగన్ వివ‌ర‌ణ‌ను తోసిపుచ్చిన విదేశాంగ శాఖ!
 రాజకీయాలు ఆపకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు

రాజకీయాలు ఆపకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు

ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాలు ఆపకపోతే చంద్రబాబుకు ప్రజలు మరోమారు బుద్ధి చెబుతారని ఆళ్ల నాని హితవు పలికారు.

రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళే విధానాలతో సీఎం జగన్ పాలన సాగిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని , పద్ధతి మార్చుకోవాలని పేర్కొన్నారు ఆళ్ళ నానీ . కుల, మత రాజకీయాలను , అసత్య ప్రచారాలను మానుకోవాలని చెప్పారు.

English summary
AP Deputy CM and Medical Health Minister Alla Nani has lashed out at TDP chief Chandrababu and Nara Lokesh. Stating that the state of Andhra Pradesh was an ideal state in the corona control, Prime Minister Narendra Modi had praised the corona prevention measures in the AP and CM Jaganmohan Reddy . Alla Nani said that Chandrababu Lokesh was worried about CM Jaganmohan Reddy's good name .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X